| Movie Name | Puttinodu Savaka Thappadu |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Balu K Asura |
| Lyricist | Balu K Asura |
| Music Label | Lahari Music |
పుట్టినోడు సావక తప్పదు… సంపదనన్నది ఎందుకురా..?
మట్టిలోన కలవక తప్పదు… రంగుల బంగులాలెందుకురా..?
పుట్టినోడు సావక తప్పదు… సంపదనన్నది ఎందుకురా..?
మట్టిలోన కలవక తప్పదు… రంగుల బంగులాలెందుకురా..?
యాడబోవు ఈ ప్రాణమో… ఎందుకింత ఆవేదనో
కాలిపోయే ఈ కట్టెకే… కక్షలంటూ ఎందుకురా || 2 ||
పుట్టినోడు సావక తప్పదు… సంపదనన్నది ఎందుకురా..?
మట్టిలోన కలవక తప్పదు… రంగుల బంగులాలెందుకురా..?
సూటిపోటి మాటలతోని… సూది లాగ గుచ్చుతుంటావురా
కష్టమొస్తే కన్నీరు తుడిశావు… కాలయముడి లాగ నవ్వేవురా
గాయపడిన బతుకుల జూసి… గురువింద గింజోలె ఉంటావురా
అవసరాలు తీరిపోయాక… కసితీరా పగ తీర్చుకుంటావురా
మనసునిండ ద్వేషమురో… మాట మార్చే తత్వమురో
ఎందుకింత ద్రోహమురో… కళ్ళు తెరచి చూడవురో || 2 ||
పుట్టినోడు సావక తప్పదు… సంపదనన్నది ఎందుకురా..?
మట్టిలోన కలవక తప్పదు… రంగుల బంగులాలెందుకురా..?
ఒంటినిండా నగలాని అంటావు… మెరిసేటి రత్నాలు ఏమాయెరా
పైస కోసం పరువును తీస్తావు… ప్రాణాలు పోతుంటే సూస్తావురా..!
ఆస్తిలోన వాటాలు అంటావు… కోటాలు దాటేటి మాటలురా
ఆకలి అంటే అన్నము పెట్టావు… హుండీలో డబ్బులు వేస్తావురా..!
పుణ్యమంటే ఎట్లొస్తదో తెలుసుకోరా… ఓ నేస్తమా…
సాయమన్నది చేస్తేనే… స్వర్గముంటే పోతావురా… || 2 ||
పుట్టినోడు సావక తప్పదు… సంపదనన్నది ఎందుకురా..?
మట్టిలోన కలవక తప్పదు… రంగుల బంగులాలెందుకురా..?
నమ్మి గొంతు కోసేటి మనుసుల… నేనెట్లా నమ్మాలి నువ్ సెప్పరా
పక్కనుండి గోతులు తీసేటి… పాపపు పుట్టక ఎందుకురా..!
మానవత్వమన్నది లేని… రాతి మనసు నీకెందుకురా
ఇంకో జన్మ ఉన్నదో లేదో… ఇప్పుడే హాయిగా ఉండాలిరా..!
వేళగాని వేళాయెరో… కమ్ముకున్న మేఘాలురో
కానరాని తీరాలురో… చేరలేని గమ్యాలురో… || 2 ||
పుట్టినోడు సావక తప్పదు… సంపదనన్నది ఎందుకురా..?
మట్టిలోన కలవక తప్పదు… రంగుల బంగులాలెందుకురా..?
Puttinodu Savaka Thappadu song is from the Puttinodu Savaka Thappadu movie.
Puttinodu Savaka Thappadu song was sung by Balu K Asura.
Puttinodu Savaka Thappadu song lyrics were written by Balu K Asura.