
| Movie Name | |
|---|---|
| Director | Narasimhan Elamadri |
| Star Cast | Mamidi Mounika |
| Music | Sv Mallikteja |
| Singer(s) | Mamidi Mounika |
| Lyricist | Sv Mallikteja |
| Music Label |
Video Label: MV MUSIC & MOVIES
పుట్టిన్నాడే పేరు వెట్టుకున్నోడు సాంగ్ లిరిక్స్ తెలుగులో
ఎండకె సెమటలు పట్టించేటోడు… సలికే వణుకులు పుట్టించేటోడు
వానని బొత్తిగా తడిపేసేటోడు… వాడితో జన్మంతా నడిపించేటోడు
పుట్టిన్నాడే పేరు వెట్టుకున్నోడు… పెరిగిన్నాడే సెయ్యి పట్టుకున్నాడో
యాడ ఉన్నడో… అబ్బబబ్బ
యాడ ఉన్నడో… ఎక్కడున్నడో నన్ను వలిచినోడు
ఎట్ల ఉన్నడొ, ఎప్పుడొస్తడో… నన్ను గెలిచినోడు…
మొట్టమొదలు వాన్ని సూసినసంది… మొదలయ్యింది నాకు ఒక్కటే రంది
లోపటంతానెమో లొల్లైతాంది… ఒక్కసారెన్నొచ్చి అడిగిపోడేంది
నన్ను మెచ్చినోడు, నాకు నచ్చినోడు… సంబురాలు సంచి నిండ తెచ్చినోడు
యాడ ఉన్నడో… అబ్బబబ్బ
యాడ ఉన్నడో… ఎక్కడున్నడో నన్ను వలిచినోడు
ఇప్పుడెట్ల ఉన్నడొ, ఎప్పుడొస్తడో… నన్ను గెలిచినోడు
నిలవడనియ్యది, కూసుండనియ్యది… వాన్నీ తప్ప ఏది తెలుసుకోనియ్యది
ఘడియ ఘడియకో గంట కోడ్తాంది… గడుసు మనసు వానెంట పడ్తాంది…
తప్పు జేత్తె ఒక్క దెబ్బ వెట్టేటోడు… తప్పయిందాని మల్ల గదమ పట్టేటోడు…
యాడ ఉన్నడో… అబ్బబబ్బ
యాడ ఉన్నడో… ఎక్కడున్నడో నన్ను వలిచినోడు
వాడు ఎట్ల ఉన్నడొ, ఎప్పుడొస్తడో… నన్ను గెలిచినోడు…
నడినెత్తి పొద్దయిన ముద్ద ముట్టట్లే… నడిజాము యాలైన నిద్ర పట్టట్లే
గీ రోగమేందని నోరు తిట్టట్లే… గీదెంపి సరళా సెయ్యి గుట్టట్లే
సెలయేరు తీరు నవ్వేటోడు… నవ్వుల్తో నా గుండె తవ్వేటోడు
యాడ ఉన్నడో… యాడ, యాడ
యాడ ఉన్నడో… నాతో వచ్చేటోడు
వాడు ఎప్పుడొస్తడో ఏనుంగొస్తడో… నన్ను గెలిచినోడు…
నారోకు నాలెక్క నాకే తేల్తాలే… నా పేరు నాతీరు యాదికొత్తలే
ఏ పని జేత్తున్న అర్థమైతలే… ఎందుకొ ఏది బుర్రకెక్కుతలే
ఎవ్వలకి దొరకని నా ఈడు జోడు… ఎన్ని కాలాలైన ఈడే నా ఓడు
యాడ ఉన్నడో…
వాడేడేడఉన్నడో… ఎక్కడున్నడో నన్ను వలిచినోడు
అబ్బబబ్బ ఎట్ల ఉన్నడొ, ఎప్పుడొస్తడో… నన్ను గెలిచినోడు…
వదిలిన బాణం తీరుగుంటాడో… నన్ను వలిచినోడు
నా కదిలిన పాణం కావాలుంటాడో… నన్ను గెలిచినోడు
ఆ మబ్బుల పల్లకి ఎక్కీ వస్తాడో…
నిన్ను వలచినోడి ముద్దులు పిల్లకి…
పగ్గామేస్తడో నిన్ను గెలిచినోడు…
ఆ మబ్బుల పల్లకి ఎక్కీ వస్తాడో…
నిన్ను వలచినోడి ముద్దులు పిల్లకి…
పగ్గామేస్తడో నిన్ను గెలిచినోడు…
Puttinnade Peru Vettukunnodu song is from the movie.
Puttinnade Peru Vettukunnodu song was sung by Mamidi Mounika.
Puttinnade Peru Vettukunnodu song lyrics were written by Sv Mallikteja.
Puttinnade Peru Vettukunnodu song music was composed by Sv Mallikteja.