| Movie Name | Ooyala |
|---|---|
| Director | S V Krishna Reddy |
| Star Cast | Srikanth, Ramya Krishna, Suhasini, Nazar |
| Music | S V Krishna Reddy |
| Singer(s) | S P Balasubramanyam & Sunitha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
పుత్తడి బొమ్మంటి… ముద్దుల బాబుకి
మెత్తని ఉయ్యాల
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు
పువ్వుల ఉయ్యాల
ఊరంత చేరి ఉప్పొంగి పోయే
పండుగ అయ్యేలా
మా కంటి పాపకి జోజోలు పాడే
గారాల ఉయ్యాల
మబ్బులలో జాబిలి మా సొంతమయ్యేలా
సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా
(ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి వింది
రామా లాలి మేఘశ్యామా లాలి)
(రామా లాలి మేఘశ్యామా లాలి)
జో జోజోజో జో జోజోజో
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి
మెత్తని ఉయ్యాల
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు
పువ్వుల ఉయ్యాల
నీ నవ్వుల్లో సిరిజల్లు కురిసిందిరా
నీ అల్లరిలో హరివిల్లు విరిసిందిరా
మా ముంగిళ్ళో రేపల్లె వెలసిందిరా
తనే పాపల్లే ఈ తల్లి మురిసిందిరా
నా ఒడిలో ఒదిగి మైమరపించరా
నువు త్వరగా ఎదిగి… నను అమ్మా అనరా
ఆ పిలుపే నా హృదయానికి ఉయ్యాల
(ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి వింది
రామా లాలి మేఘశ్యామా లాలి)
జో ఓ ఓఓ, పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి
మెత్తని ఉయ్యాల
జో ఓ ఓఓ, పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు
పువ్వుల ఉయ్యాల
ఈ కోటంతా ఇన్నాళ్ళు చినబోయెరా
ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా
నీ చేతుల్లో బొమ్మలుగా ఉంటామురా
నువ్వు ఊరేగే అంబారి అవుతామురా
నా పాలే తాగి… నను పాలించరా
మా పది ప్రాణాలు… నీలో పెంచరా
మా జతకే నువు ఊపాలి జంపాలా
(ఇన్నాళ్ళకి ఇలా ఈ లోగిలి వింది
రామా లాలి మేఘశ్యామా లాలి)
జో ఓ ఓఓ, పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి
మెత్తని ఉయ్యాల
జో ఓ ఓఓ, పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు
పువ్వుల ఉయ్యాల
పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి
మెత్తని ఉయ్యాల
లాలల లాల లాలల లాల
లాలల లాల లా
పొత్తిళ్ళలోని పున్నమి రాజుకు
పువ్వుల ఉయ్యాల, మ్ మ్ మ్
Putthadi Bommanti song is from the Ooyala movie.
Putthadi Bommanti song was sung by S P Balasubramanyam & Sunitha.
Putthadi Bommanti song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Putthadi Bommanti song music was composed by S V Krishna Reddy.