
| Movie Name | Neninthe (2008) |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Ravi Teja, Siya Gowtham |
| Music | Chakri |
| Singer(s) | Geetha Madhuri |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Aditya Music |
పుడుతూనే ఉయ్యాలా
నువ్ పోతే మొయ్యాలా
పుడుతూనే ఉయ్యాల
నువ్ పోతే మొయ్యాల
ఈలోపే ఏదో చెయ్యాలా
ఏలాల ఏలాల
దునియానే ఏలాల
చకచకచక చెడుగుడు ఆడాలా
తూగుంటే వస్తయా
మాపంటే ఉంటయా
కొండంత ఆశయా
కూసింత లైఫ్ అయా
ఇరగేసేయ్ తిరగేసేయ్
దున్నేసెయ్ దులిపేసెయ్
అందంగా ఆనందంగా
ఇష్టంగా బతికేసెయ్
ఇరగేసేయ్ తిరగేసేయ్
దున్నేసెయ్ దులిపేసెయ్
అందంగా ఆనందంగా
ఇష్టంగా బతికేసెయ్
పుడుతూనే ఉయ్యాల
నువ్ పోతే మొయ్యాల
ఈలోపే ఏదో చెయ్యాలా
అవకాశం రాలేదంటూ… గుక్కే పట్టి ఏడొద్దే
ఏనాడో వచ్చుంటాది… నువ్వే వదిలేసుంటావే
చీకటిని తిడుతూ తొంగుంటే
వేకువకి చోటే లేదులే
నిన్నేం తిరిగి రాదు కదా
రేపేం జరుగుతుందో కదా
నీకై మిగిలివుంది ఇక ఈరోజే
టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాధలూ
రిస్కే లేని లైఫులూ బోరు బోరే
నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా
బోల్డంత సంపాదించినా
ఒరే నాన్నా పొంగిపోకురా
గెలుపెవ్వడి సొత్తు కాదురా
అది నీతో మొదలవ లేదురా
అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా
పుడుతూనే ఉయ్యాల
నువ్ పోతే మొయ్యాల
ఈలోపే ఏదో చెయ్యాల
నిలుచుంటే బస్ స్టేషన్లో… బస్సొస్తాది ఎక్కొచ్చే
పడిపోతే ఫ్రస్టేషన్లో… ఏముంటాది ఎక్కాకే
ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ… సక్సెస్‌తో సర్దేయొచ్చులే
పడినా తిరిగి లేవడం
బాల్యం మొదటి లక్షణం
దాన్నే మరచిపోవడం వింతేగా
ఏది ఎంత అవసరం… ఇట్టే తెలుసుకోవటం
అంతే మోసుకెల్లడం హ్యాపీగా
నిను బయపెట్టే పనులేమిటో
అవి చేసేయ్ రోజుకొక్కటి
ఇక ఆపై జడుపే రాదురా
నీ గోలే గుల్లై పోయినా
కర్మంతా కాలి పోయినా
ప్రేమిస్తేనే పని చెయ్యరా
పుడుతూనే ఉయ్యాల
నువ్ పోతే మొయ్యాల
ఈలోపే ఏదో చెయ్యాల
ఏలాల ఏలాల… దునియానే ఏలాల
చకచకచక చెడుగుడు ఆడాలా
Puduthune Uyyala song is from the Neninthe movie.
Puduthune Uyyala song was sung by Geetha Madhuri.
Puduthune Uyyala song lyrics were written by Bhaskara Bhatla.
Puduthune Uyyala song music was composed by Chakri.