Priyatama Nanu Palakarinchu Song Lyrics - & English - ‘Jagadeka

Priyatama Nanu Palakarinchu Song Lyrics - & English - ‘Jagadeka
Priyatama Nanu Palakarinchu Song Lyrics: Priyatama Nanu Palakarinchu is a Telugu song from the film & English - ‘Jagadeka starring Chiranjeevi, Sridevi, directed by K. Raghavendra Rao. "Priyatama Nanu Palakarinchu" song was composed by Ilaiyaraaja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Priyatama Nanu Palakarinchu Song Details

Movie Name& English - ‘Jagadeka
DirectorK. Raghavendra Rao
Star CastChiranjeevi, Sridevi
MusicIlaiyaraaja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Priyatama Nanu Palakarinchu Song Lyrics in Telugu

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

బ్రతుకులోని బంధమా… పలుకలేని భావమా

మరువలేని స్నేహమా… మరలిరాని నేస్తమా

ప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

ఎదుట ఉన్న స్వర్గమా… చెదిరిపోని స్వప్నమా

కనులలోని కావ్యమా… కౌగిలింత ప్రాణమా

ప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

నింగి వీణకేమో నేల పాటలొచ్చె… తెలుగు జిలుగు అన్నీ తెలిసి

పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ… వలపె తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా… నరుడే, వరుడై నాలో మెరిసే

తారలమ్మకన్న చీరకట్టుకున్న… పడుచుతనము నాలో మురిసే

మబ్బులనీ వీడిపోయి… కలిసే నయనం, తెలిసే హృదయం

తారలన్ని దాటగానే… తగిలే గగనం, రగిలే విరహం

రాయలేని భాషలో… ఎన్ని ప్రేమలేఖలో

రాయిలాంటి గొంతులో… ఎన్ని మూగపాటలో

అడుగే పడక… గడువే గడిచి పిలిచే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదో వేణువూదిపోయే… శృతిలో జతిలో నిన్నే కలిపి

దేవగానమంత ఎంకి పాటలాయే… మనసు మమత అన్నీ కలిసి

వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే… బహుశా మనసా వాచా వలచి

మేనకల్లే వచ్చి జానకల్లే మారె… కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన… వెలిగే ఉదయం, విధికే విలయం

నీవులేని నేలమీద… బ్రతుకే ప్రళయం, మనసే మరణం

వానవిల్లు గుండెలో… నీటికెన్ని రంగులో

అమృతాల విందులో… ఎందుకిన్ని హద్దులో

జగమే అణువై… యుగమే క్షణమై మిగిలే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

బ్రతుకులోని బంధమా… పలుకలేని భావమా

కనులలోని కావ్యమా… కౌగిలింత ప్రాణమా

ప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ

ప్రియతమా నను పలకరించు ప్రణయమా

అతిథిలా నను చేరుకున్న హృదయమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - ‘Jagadeka Movie

  1. Priyatama Nanu Palakarinchu Song Lyrics

Priyatama Nanu Palakarinchu Song FAQ

What movie is Priyatama Nanu Palakarinchu song from?

Priyatama Nanu Palakarinchu song is from the & English - ‘Jagadeka movie.

Who sang Priyatama Nanu Palakarinchu song?

Priyatama Nanu Palakarinchu song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Priyatama Nanu Palakarinchu song lyrics?

Priyatama Nanu Palakarinchu song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Priyatama Nanu Palakarinchu song?

Priyatama Nanu Palakarinchu song music was composed by Ilaiyaraaja.