| Movie Name | & English - Vennela |
|---|---|
| Director | Deva Katta |
| Star Cast | Raja, Parvati Melton |
| Music | Mahesh Shankar |
| Singer(s) | Rishi |
| Lyricist | Deva Katta |
| Music Label |
ప్రేయసి కావు నేస్తం కావు
గుండెల్లో నిండున్నావు
గుప్పెట్లో దాగున్నావు
చీకట్లో వెలుగిస్తావు
జగమంతా కనిపిస్తావు
పండుగ నీవు… నా పచ్చిక నీవు
పండుగ నీవు… నా పచ్చిక నీవు
మోహమే మంటగా రగులుతున్నా
లోకమే నీవుగా మునిగివున్నా
గాలిలో ఈకల తేలుతున్నా
నీటిలో రాతలా చెదిరివున్నా
నీ శ్వాసకోసం మానై ఉంటా
నీ మాటకోసం మునినై పోతా
నీ చూపు కోసం శిలనై ఉంటా
నీ నవ్వుకోసం అలుసై పోతా
జాబిలికే వెన్నెల నీవు
సూర్యునికే వేకువ నీవు
ఊపిరిలో ఉష్ణం నీవు
ఊరించే తృష్ణం నీవు
శూన్యం నీవు… నా శోకం నీవు
శూన్యం నీవు… నా శోకం నీవు
వేసవి వర్షమై కురిసిపోవా
వెచ్చని వేకువై వెలిగిరావా
మాటతో రూపమై తరలిరావా
నిర్ణయం చెప్పి… నన్నాదుకోవా
నీ తోడుకోసం ఆవిరైపోనా
నీ స్పర్శకోసం చినుకై రానా
నీ అడుగు తాకి గుడినైపోనా
నీ గుండెలోకి సడినై రానా
నీలానికి నింగివి నీవు
కాలానికి గమ్యం నీవు
చలనానికి శక్తివి నీవు
భావానికి మూలం నీవు
ఎవ్వరి కోసం… ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం… ఈ వెన్నెల దీపం
ఎవ్వరి కోసం… ఈ జాబిలి వేషం
కమ్మని కావ్యం… ఈ వెన్నెల దీపం
Preyasi Kavu song is from the & English - Vennela movie.
Preyasi Kavu song was sung by Rishi.
Preyasi Kavu song lyrics were written by Deva Katta.
Preyasi Kavu song music was composed by Mahesh Shankar.