
| Movie Name | Girl Friend (2002) |
|---|---|
| Director | G.Nageswara Reddy |
| Star Cast | Rohit, Anitha Patil, Ruthika |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | RP Patnaik, Usha |
| Lyricist | Taidala Bapu |
| Music Label |
ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే
నారాయణ సత్యనారాయణ
ప్రేమెంతా… ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ
సత్యనారాయణ
ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే
నారాయణ సత్యనారాయణ
గుట్టుగా చిన్ని గుండెలోకి
చెప్పకుండా చేరింది
ఇప్పుడేమో తియ్యనైన
తిప్పలెన్నో పెడుతోంది
ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే
నారాయణ సత్యనారాయణ
నిన్ను చూసి ఓ చెలి
మనసు నిలవకున్నదే
నిలువక నీడై అది
నిన్నే చేరుకున్నదే
ఓ, నీకు మల్లె నాలోన
కధే మొదలు అయినది
కమ్మని కష్టమేదో
మదిలో మెదులుతున్నది
ఎన్నడు లేని ఈ వైనమేమిటీ
కొత్తగా ప్రేమ పేజీ మొదలు అయినది
నా మనసు గిల్లినా… ఓ చెలియా
నీ వయసు ముడుపులే దోచుకుపోనా
ఎదలోపల నీ రూపమే
నా మదిని మేలుకొలిపెనే
ప్రేమెంత…ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే
నారాయణ సత్యనారాయణ
చూడ చక్కని చెలి
సుందరాంగి నీవులే
ఆకలి దప్పిక ఏది
నిన్ను చూస్తే పుట్టదే
వలపే పువ్వులుగ
పూసిన ఈ వేళలో
మండే ఎండ కూడ
మంచులాగ కురిసెనే
చెలి నీ నవ్వే వెదజల్లే పరిమళం
హయ్యో రామ నీకేమి సంబరం
వేపాకైనా ఓ లలనా
తీయగా ఉందే నీ వలనా
చిరునవ్వులే నువ్వు రువ్వితే
నా నరనరాలు పంక్చరే
ప్రేమెంతా
ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే నారాయణ
సత్యనారాయణ
ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే
నారాయణ సత్యనారాయణ
గుట్టుగా చిన్ని గుండెలోకి
చెప్పకుండా చేరింది
ఇప్పుడేమో తియ్యనైన
తిప్పలెన్నో పెడుతోంది
ప్రేమెంత పనిచేసే నారాయణ
ఈ ప్రేమెంత పనిచేసే
నారాయణ సత్యనారాయణ
Prementha Panichese song is from the Girl Friend movie.
Prementha Panichese song was sung by RP Patnaik, Usha.
Prementha Panichese song lyrics were written by Taidala Bapu.
Prementha Panichese song music was composed by Vandemataram Srinivas.