Movie Name | Court (2025) |
---|---|
Director | Ram Jagadeesh |
Star Cast | Sridevi, Harsh Roshan, Priyadarshi Pulikonda |
Music | Vijai Bulganin |
Singer(s) | Anurag Kulakarni & Sameera Bharadwaj |
Lyricist | Purnachary |
Music Label | Saregama Telugu |
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత, అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత. అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె
అన్ని మాటలు…
ముందు లేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలు…
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో..
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత, అరెరే
ఆకాశం తాకాలి… అని ఉందా
నాతోరా చూపిస్తా… ఆ సరదా ఆ ఆ
నేలంతా చూట్టేసే వీలుందా ఆ ఆ
ఏముంది ప్రేమిస్తే సరిపోదా, ఆ ఆ
అహ మబ్బులన్ని కొమ్మలై
పూల వాన పంపితే
ఆ వాన పేరు ప్రేమలే
దాని ఊరు మనములే
ఏ మనసుని ఏమడగకు
ఏ రుజువుని ఓ ఓ… అంతే ఓ ఓ
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
మ్మ్, ఎంతుంటే ఏంటంటా దూరాలు
రెక్కల్లా అయిపోతే పాదాలు
ఉన్నాయా బంధించి దారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు
అరె నింగిలోని చుక్కలే
కిందకొచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే
ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరెను
పొరపాటునా అని, ఓ ఓ… అంతే ఓ ఓ
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో
వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత, అరెరే
చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత, అరెరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె
అన్ని మాటలు…
ముందు లేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో, ఓ ఓ……