
| Movie Name | Abhinandana (1988) |
|---|---|
| Director | Ashok Kumar |
| Star Cast | Karthik, Shobana, Sarath Babu |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Aditya Music |
లాలలాలల లాలాలా లాలాల
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని… ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ… నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ… నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లాలలాలల లాలాలా లలాల
మనసు మాసిపోతే… మనిషే కాదని
కఠికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
ఘడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ముసురు గప్పి… మూగబోయి నీవుంటివీ
ఉసురు కప్పి… మూగబోయి నీవుంటివీ
మోడుబారి నీడ తోడు లేకుంటినీ
ప్రేమ లేదని…హ్హ లల లాల లాలల
గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలుపోవు… వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల… నిన్ను చూసి రోదించనీ
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ… నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లల లల లలాలా
లల లల లలాలా
Prema Ledani song is from the Abhinandana movie.
Prema Ledani song was sung by S P Balasubramanyam.
Prema Ledani song lyrics were written by Acharya Athreya.
Prema Ledani song music was composed by Ilayaraja.