
| Movie Name | & English - Ekaveera |
|---|---|
| Director | CS Rao |
| Star Cast | N T Rama Rao, KR Vijaya, Jamuna, Kantha Rao |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam, Ghantasala |
| Lyricist | Devulapalli Krishna Sastry |
| Music Label | Saregama Telugu |
Prathi Rathri Vasantha Ratri Lyrics in Telugu
మ్ మ్ మ్ మ్ ఆఆ ఆ ఆ
ఆఆ ఆ ఆ, ఆ ఆఆ ఆ
ఆ హా హా హా ఆ
ప్రతీ రాత్రి వసంత రాత్రి… ప్రతి గాలి పైరగాలి
ప్రతీ రాత్రి వసంత రాత్రి… ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం… పాట లాగా సాగాలి
ప్రతి నిమిషం ప్రియా ప్రియా… పాటలాగా సాగాలి
ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
నీలో నా పాట కదలి… నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి… నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదలా… పూలెన్నో విరిసి విరిసీ
లోలోన మల్లె పొదలా… పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం… మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా… మధుమాసం కావాలి
ప్రతీ రాత్రి వసంత రాత్రి… ప్రతి గాలి పైరగాలి
ఒరిగింది చంద్రవంక… వయ్యారి తార వంక
ఒరిగింది చంద్రవంక… వయ్యారి తార వంక
విరిజాజి తీగ సుంత… జరిగింది మావి చెంత
విరిజాజి తీగ సుంత… జరిగింది మావి చెంత
నను జూచి నిను జూచి… వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా… వనమంతా వలచింది
ప్రతీ రాత్రి వసంత రాత్రి
ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం
పాట లాగా సాగాలి
పాట లాగా సాగాలి
Prathi Rathri Vasantha Ratri song is from the & English - Ekaveera movie.
Prathi Rathri Vasantha Ratri song was sung by S P Balasubramanyam, Ghantasala.
Prathi Rathri Vasantha Ratri song lyrics were written by Devulapalli Krishna Sastry.
Prathi Rathri Vasantha Ratri song music was composed by KV Mahadevan.