
| Movie Name | Navaratri |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Dr Josyabhatla |
| Singer(s) | |
| Lyricist | Naga Gurunatha Sarma |
| Music Label |
Pranavam Lo Koluvaina Parameshwari Lyrics in Telugu
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ
నవరాత్రి వెలుగైన శివశంకరీ
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ
నవరాత్రి వెలుగైన శివశంకరీ
ఆసేతు కాశ్మీర కరుణాఝరీ
ఆసేతు కాశ్మీర కరుణాఝరీ
ఆధారమే నీవు అమృతాక్షరీ
ఆధారమే నీవు అమృతాక్షరీ
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ
నవరాత్రి వెలుగైన శివశంకరీ
పారాణి పాదాల బాలాకృతీ
గాయత్రి వేదాంత లీలా శృతీ
లోకానికే అన్నపూర్ణమ్మవై
మహిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మివై
సంగీత వేణీ… సాహిత్య వాణి
మా జీవితాలే… నీ వీణాకృతులై
నిరతంబు వినిపించనీ
ప్రణవంలొ కొలువైన పరమేశ్వరీ
నవరాత్రి వెలుగైన శివశంకరీ
శ్రీచక్ర నిలయాన… లలితాంబికా
దురితాలు తొలగించు దుర్గాత్మికా
మహిషాదులను… చీల్చు మంత్రానివై
తరియించు మార్గాల తంత్రానివై
శ్రీ భధ్రకాళీ… శివ నాట్యకేళీ
శ్రీ భధ్రకాళీ… శివ నాట్యకేళీ
దాటించవమ్మా వైకుంఠపాళీ
శ్రీరాజరాజేశ్వరీ… శ్రీరాజరాజేశ్వరీ
శ్రీ రాజరాజేశ్వరీ
Pranavam Lo Koluvaina Parameshwari song is from the Navaratri movie.
Pranavam Lo Koluvaina Parameshwari song lyrics were written by Naga Gurunatha Sarma.
Pranavam Lo Koluvaina Parameshwari song music was composed by Dr Josyabhatla.