
| Movie Name | & English - Darling |
|---|---|
| Director | A. Karunakaran |
| Star Cast | Prabhas, Kajal Agarwal |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Rahul Nambiar |
| Lyricist | Ananth Sriram |
| Music Label | SonyMusicSouthVEVO |
తన నన నానా, యా యా
తన నన నానా, యా యా
ప్రాణమా ప్రాణమా
అరె సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్టావే వింతగా
తన నన నానా
నిన్నా మొన్నా లేని… సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోట
చిన్నా పెద్దా చేరి… చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక… నీ ఆట
దూరాన్ని దూరంగా… తోసావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో
తన నన నానా
గిల్లీకజ్జాలన్నీ మళ్ళీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ… ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు… తియతియ్యగా
హో, ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమా ప్రాణమా, ఓ… ప్రాణమా, ఓ ఓఓ ఓ
ప్రాణమా ప్రాణమా..!
అరె సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షంలాగా… కురిసావే ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్టావే వింతగా
తన నన నానా… తన నన నానా
Pranama song is from the & English - Darling movie.
Pranama song was sung by Rahul Nambiar.
Pranama song lyrics were written by Ananth Sriram.
Pranama song music was composed by GV Prakash Kumar.