
| Movie Name | & English - Oye Cinema |
|---|---|
| Director | Raj Anand |
| Star Cast | Siddharth, Shamili |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Yuvan Shankar Raja |
| Lyricist | Vanamali |
| Music Label | Aditya Music |
నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా
వేకువనే సందె వాలిపోతోందే
చీకటిలో ఉదయముండి పోయిందే
నా యదనే తొలిచిన
గురుతిక నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బతుకిక
బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవద్ధే పోవద్ధే ప్రేమా
నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా
ఇన్ని నాళ్ళు నీ వెంటే
సాగుతున్న నా పాదం
వెంటపడిన అడుగేదంటోందే, ఓ ఓ
నిన్నదాక నీ రూపం
నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తుందే
కోరుకున్న జీవితమే
చేరువైన ఈ క్షణమే
జాలిలేని విధిరాతే శాపమైనదే
మరుజన్మే ఉన్నదంటే
బ్రహ్మనైనా అడిగేదొకటే
గనమంతా మమ్ము తన
ఆటలిక సాగని చోటే
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవద్ధే పోవద్ధే ప్రేమా
నువ్వుంటే నేనుంటా ప్రేమా
పోవద్ధే పోవద్ధే ప్రేమా
Povodhe Prema song is from the & English - Oye Cinema movie.
Povodhe Prema song was sung by Yuvan Shankar Raja.
Povodhe Prema song lyrics were written by Vanamali.
Povodhe Prema song music was composed by Yuvan Shankar Raja.