
| Movie Name | |
|---|---|
| Director | Koratala Siva |
| Star Cast | Mahesh Babu, Shruthi Hasan |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | MLR Karthikeyan |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
ఓ నిండు భూమి నిను
రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా
పిలుపు వినరా మలుపు కనరా
పరుగువై పదపదరా
గుండె దాటుకుని పండుగైన కల
పసిడి దారులను తెరిచినదా
రుణము తీర్చే తరుణమిదిరా
కిరణమై పదపదరా
ఓ ఓ ఏమి వదిలి ఎటు కదులుతోందొ
మది మాటకైన మరి తలచినదా
మనిషి తనమే నిజము ధనమై
పరులకై పద పదరా
మరలి మరల వెనుదిరగనన్న
చిరునవ్వే నీకు తొలి గెలుపు కదా
మనసు వెతికే మార్గమిదిరా
మంచికై పదపదరా
లోకం చీకట్లు చీల్చే
ధ్యేయం నీ ఇంధనం
ప్రేమై వర్షించనీ నీ ప్రాణం
సాయం సమాజమే
నీ గేయం నిరంతరం
కోరే ప్రపంచ సౌఖ్యం
నీకు గాక ఎవరికి సాధ్యం
విశ్వమంతటికి పేరుపేరునా
ప్రేమ పంచగల పసితనమా
ఎదురు చూసే ఎదను మీటే
పవనమై పదపదరా
లేనిదేదొ పని లేనిదేదొ
విడమరిచి చూడగల ఋషి గుణమా
చిగురు మురిసే చినుకు తడిగా
పయనమై పదపదరా
పోరా శ్రీమంతుడా… పో పోరా శ్రీమంతుడా
నీలో లక్ష్యానికి జయహో, ఓ ఓ
పోరా శ్రీమంతుడా… పో పోరా శ్రీమంతుడా
నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా
జయహో జయహో హో
Pora Srimanthuda song is from the movie.
Pora Srimanthuda song was sung by MLR Karthikeyan.
Pora Srimanthuda song lyrics were written by Ramajogayya Sastry.
Pora Srimanthuda song music was composed by Devi Sri Prasad.