
| Movie Name | 1947 (1947) |
|---|---|
| Director | A.L.Vijay |
| Star Cast | Aarya, Amy Jackson |
| Music | GV Prakash Kumar |
| Singer(s) | Harini & Roop Kumar Rathod |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
పూలు పూయు తరుణం
లోకంలో ఎవరు చూడలేదే
ప్రేమ పొంగు సమయం
హృదయంలో ఎవరు పోల్చలేదే
నిన్న మరి ఘడియ సాగలేదే
నీ ఒడిలో యుగము చాలలేదే
పెదవి కదలలేదే నీ జతలో
కదల తలుపు లేదే, ఇది ఏంటో
రేయి గడవలేదే, గడిచాక
పగలు ముగియలేదే పావురమా.
మాటనేది లేదు… భాషనేది లేదు
చూపు భాష నాకు చాలులే
నిన్ననేది లేదు… రేపనేది లేదు
నేటి రోజు నాకు చాలులే
నారన్నదే లేదు… నీరన్నదే లేదు
నాలోన విరితోట విరబూసెనే
ఏ కత్తి పిడి లేదు… ఏ రక్త తడి లేదు
నుని మెత్తని ప్రేమ నను గెలిచెనే
కలిసిపోయే మనసు
తొలిసారి నిలిచిపోయే అడుగు
నిను చేరి నిలిచిపోయే మనసు
ప్రతిసారి కలిసి వేయి అడుగు పావురమా
ఏమి మేఘమిది ఎదుట కురిసి
ఎద ఏరువాకలుగా మార్చెనే
ఏమి బంధమిది ఎపుడు ఎరగనిది
ఏడు సంద్రములు దాటెనే
ఏ ఊరో నాకేంటి… ఏం పేరో నాకేంటి
ఎనలేని అనుబంధం పెరిగిందిలే
మైదానమైతేంటి శిఖరాగ్రమైతేంటి
మది నేడు తన నుండి కదలిందిలే
పలుకు ఆగుతున్న
ప్రాణంతో పాట ఆగలేదే
ప్రియ లయలో నడక ఆగుతున్న
జీవంలో నాట్యమాగలేదే, ఇది ఏంటో
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
పూలు పూయు తరుణం
లోకంలో ఎవరు చూడలేదే
ప్రేమ పొంగు సమయం
హృదయంలో ఎవరు పోల్చలేదే
నిన్న మరి ఘడియ సాగలేదే
నీ ఒడిలో యుగము చాలలేదే
పెదవి కదలలేదే నీ జతలో
కదల తలుపు లేదే, ఇది ఏంటో
రేయి గడవలేదే, గడిచాక
పగలు ముగియలేదే పావురమా.
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
తాన ధోం తనన తాన ధోం తనన
తాన ధోం త తన తానానె తననే
Poolu Pooyu song is from the 1947 movie.
Poolu Pooyu song was sung by Harini & Roop Kumar Rathod.
Poolu Pooyu song lyrics were written by Chandra Bose.
Poolu Pooyu song music was composed by GV Prakash Kumar.