
| Movie Name | Sathruvu (1990) |
|---|---|
| Director | Kodi Ramakrishna |
| Star Cast | Venkatesh, Vijayashanti |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Tips Telugu |
పొద్దున్నే పుట్టిందీ చందమామ
మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావ గీతికా, హోయ్
స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో
పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
ఉగ్గెట్టా పట్టాలో నలుగెట్టా పెట్టాలో
లాలెట్టా పోయాలోయమ్మ
ఓ రబ్బరు బొమ్మ… లాలించేదెట్ట చెప్పమ్మ
మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే సిగ్గొస్తే
జాబిల్లిని రప్పించాలయ్యో
ఓ ముద్దుల కన్నా… కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో ఉయ్యాల వెయ్యాలా
ఈ కొంటె పాపాయికి
ముందూ మునుపు లేని ఈ పొద్దుటి వెన్నెల ఆవిరిలో
ముద్దూ మురిపాలన్ని పండించేదెట్టాగో
ఇక ఏ పేరు పెట్టాలో… ఇన్నాళ్ళు ఎరగని
ఈ కొంటే చక్కిలిగింతల ఉక్కిరిబిక్కిరికి
పొద్దున్నే పుట్టిందీ చందమామ
మొగ్గల్లే విచ్చిందీ ముద్దుగుమ్మ
నీ కోసం పుట్టాను… నిలువెల్లా పూశాను
గుండెల్లో గూడే కట్టాను… నా బంగరు గువ్వ
గుమ్మంలో చూపులు కట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను
కళ్ళల్లో కాపురముంటాను… నా పచ్చని కొమ్మ
పొమ్మన్నా పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్లు వెయ్యాలా
సింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి
కొంగున కట్టేసే నీ కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే… బరువైన కన్నుల్లో
పగలేదో రేయేదో తెలియదు లేవయ్యో
పొద్దున్నే పుట్టింది చందమామ
మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టావా గీతికా, హోయ్
స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి
ముత్యాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో
Poddunne Puttindi Chandamama song is from the Sathruvu movie.
Poddunne Puttindi Chandamama song was sung by S P Balasubramanyam, KS Chitra.
Poddunne Puttindi Chandamama song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Poddunne Puttindi Chandamama song music was composed by Raj-Koti.