| Movie Name | Letha Manusulu (1966) |
|---|---|
| Director | |
| Star Cast | Harinath, Jamuna, Baby Padmini |
| Music | M.S.Viswanathan |
| Singer(s) | P Susheela |
| Lyricist | Aarudra |
| Music Label |
పిల్లలు దేవుడు చల్లని వారే…
కల్లకపటమెరుగని కరుణామయులే
పిల్లలు దేవుడు చల్లని వారే…
కల్లకపటమెరుగని కరుణామయులే…
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం…
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం…
పిల్లలు దేవుడు చల్లని వారే…కల్లకపటమెరుగని కరుణామయులే
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును… ||2||
ఆ పురుటికందు మనసులో దైవముండును… ||2||
వయసు పెరిగి ఈసు కలిగి… మదము హెచ్చితే ||2||
అంత మనిషిలో… దేవుడే మాయమగునులే ||2||
పిల్లలు దేవుడు చల్లని వారే… కల్లకపటమెరుగని కరుణామయులే
వెలుగుతున్న సూర్యుణ్ణి… మబ్బు మూయును ||2||
మనిషి తెలివియనే సూర్యుణ్ణి… కోపం మూయును ||2||
గాలి వీచ మబ్బు… తెరలు కదలిపోవులే ||2||
మాట కలుపుకున్న కోపమే… చెలిమి అగునులే ||2||
పిల్లలు దేవుడు చల్లని వారే… కల్లకపటమెరుగని కరుణామయులే
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు… ||2||
ఆ పెద్దలేమో కలహిస్తే… చిన్నబోదురు ||2||
మాయమర్మమేమి లేని బాలలందరు… ||2||
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే… ||2||
పిల్లలు దేవుడు చల్లని వారే… కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం…
పిల్లలు దేవుడు చల్లని వారే…కల్లకపటమెరుగని కరుణామయులే
Pillalu Devudu Challani Vaare song is from the Letha Manusulu movie.
Pillalu Devudu Challani Vaare song was sung by P Susheela.
Pillalu Devudu Challani Vaare song lyrics were written by Aarudra.
Pillalu Devudu Challani Vaare song music was composed by M.S.Viswanathan.