Pilla Puli Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by GV Prakash Kumar, and sung by Anurag Kulkarni & Harish Sivaramakrishnan from Telugu cinema ‘Aakaasam Nee Haddhu Ra‘.
Pilla Puli Song Lyrics: Pilla Puli is a Telugu song from the film Aakaasam Nee Haddhu Ra starring Suriya, Aparna Balamurali, directed by Sudha Kongara. "Pilla Puli" song was composed by GV Prakash Kumar and sung by Anurag Kulkarni & Harish Sivaramakrishnan, with lyrics written by Ramajogayya Sastry.
Pilla Puli Song Details
Movie Name
Aakaasam Nee Haddhu Ra (2020)
Director
Sudha Kongara
Star Cast
Suriya, Aparna Balamurali
Music
GV Prakash Kumar
Singer(s)
Anurag Kulkarni & Harish Sivaramakrishnan
Lyricist
Ramajogayya Sastry
Music Label
Sony Music
Pilla Puli Song Lyrics in Telugu
కవ్వం చిలికినట్టే గుండెల్ని గెలికేస్తివే యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే పాలసంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు ముత్యంలా ఉన్నాదే ముక్కట్టు కొన్ని అందాలు చూపెట్టు ఇంకొన్ని దాపెట్టు మొత్తంగా నా నోరే ఊరేట్టు పిల్లా పులి పిల్లా పులి పోరగాడే నీకు బలి
నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే అల్లాడించావే పిల్లా నచ్చావే Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే
చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా నన్నట్టా పెట్టేసుకో పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె తడవాలి నా కల నీ ఓరచూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెల పిల్లా భూమికొక్క పిల్లా ఎల్లా నిన్ను వదిలేదెల్లా
Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే
మామూలు మాటైనా కొట్నట్టు తిట్నట్టు మహా ముక్కుసూటిలే నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తన్నట్టు కేరింతలైతినే Ho నీలాంటి పిల్లమ్మి మళ్ళొచ్చి నా కంట పడతాదో లేదోలే ఓ వెయ్యి జనమాలు ఆలస్యం అయితేనేం నీకోసం చూస్తానే సొట్టబుగ్గ పిట్టా నీకు తాళికట్టా ఇట్టా ముందుగానే పుట్టా
Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే