
| Movie Name | Adesh Ravi |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో
పూట పూట చేసుకొని బతికేటోల్లం… పూట గడవ ఇంత దూరం ఒచ్చినోల్లం…
దేశమేమో గొప్పదాయె… మా బతుకులేమో చిన్నవాయే
మాయదారి రోగమొచ్చి… మా బతుకు మీద మన్నువోసే…
ఏమి బతుకూ… ఏమి బతుకూ… చెడ్డ బతుకు
చెడ్డ బతుకు… చెడ్డ బతుకు…
పేద రోగం కంటే పెద్ద రోగముందా… అయిన వాళ్ళ కంటే పెద్ద అండ ఉందా…
కష్ట కాలం ఇంటి కాడా ఉంట సారు… కలిసిమెలిసి కలోగంజో తాగెటోల్లం…
పిల్లగాన్లు కన్నులల్ల… విడవకుండా మెదులవట్టె…
ఇంటిదాని దుఃఖమెమో… ఆగకుండా తరుమవట్టె…
ఏమి జేత్తు………
బస్సులొద్దు, బండ్లు వద్దు… అయ్యా సారూ…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…
బస్సులొద్దు, బండ్లు వద్దు… అయ్యా సారూ…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…
ఇంటికాడ పిల్ల జెల్లా ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో
ఇంటికాడ పిల్ల జెల్లా ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…
Pilla Jalla Intikada Yetla Undro song is from the Adesh Ravi movie.