Pellante Pandillu Song Lyrics - Trishulam

Pellante Pandillu Song Lyrics - Trishulam
Pellante Pandillu Song Lyrics: Pellante Pandillu is a Telugu song from the film Trishulam starring Krishnam Raju, Sridevi, Raadhika, Jayasudha, directed by K. Raghavendra Rao. "Pellante Pandillu" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, P Susheela. Lyrics were written by Acharya Athreya.

Pellante Pandillu Song Details

Movie NameTrishulam (1982)
DirectorK. Raghavendra Rao
Star CastKrishnam Raju, Sridevi, Raadhika, Jayasudha
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, P Susheela
LyricistAcharya Athreya
Music Label

Pellante Pandillu Song Lyrics in Telugu

ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ

ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ

ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ

పెళ్ళంటె..?

పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు

తప్పెట్లు తాళాలు తలంబ్రాలు

మూడే ముళ్ళు ఏడే అడుగులు

మొత్తం కలిసి నూరేళ్ళు, హ హ హ ఆఆ

పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు

తప్పెట్లు తాళాలు తలంబ్రాలు

మూడే ముళ్ళు ఏడే అడుగులు

మొత్తం కలిసి నూరేళ్ళు

పెళ్ళైతె..!!

పెళ్ళైతె ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు

ముత్తైదు భాగ్యాలు

ముద్దూముచ్చట్లు మురిసే లోగుట్లు

చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు, హ హ హ ఆఆ

పెళ్ళైతె ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు

ముత్తైదు భాగ్యాలు, మ్ మ్ మ్

గోదారి ఒడ్డున గోగుల్లు పూచిన వెన్నెలలో

కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో

ఆ ఆఆ, గోదారి ఒడ్డున గోగుల్లు పూచిన వెన్నెలలో

కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో

మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులో

హృదయాలు పెదవుల్లో ఎరుపెక్కు ఏకాంత వేళల్లో

వలపు పులకింతలో వయసు గిలిగింతలో

వింతైన సొగసుల వేడుకలో

పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు

తప్పెట్లు తాళాలు తలంబ్రాలు

మూడే ముళ్ళు ఏడే అడుగులు

మొత్తం కలిసి నూరేళ్ళు, హ హ హ ఆఆ

పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు

తప్పెట్లు తాళాలు తలంబ్రాలు, ఆఆ ఆ

కలలన్ని కలబోసి వెలసిన ఈ పంచవటిలో

ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో

ఆ ఆ, కలలన్ని కలబోసి వెలసిన ఈ పంచవటిలో

ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో

సిరిమువ్వ రవళుల మరిపించు

నీ నవ్వు సవ్వడిలో

కులమన్నదే లేని అలనాటి

వేదాల ఒరవడిలో

సామగానాలము సరస రాగాలము

ప్రేమికులమన్న కులమున్న లోకంలో

హ హ హ ఆఆ, పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు

తప్పెట్లు తాళాలు తలంబ్రాలు

మూడే ముళ్ళు ఏడే అడుగులు

మొత్తం కలిసి నూరేళ్ళు, హ హ హ ఆఆ

పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు

తప్పెట్లు తాళాలు తలంబ్రాలు

మూడే ముళ్ళు ఏడే అడుగులు

మొత్తం కలిసి నూరేళ్ళు

ఆ ఆ ఆ ఆఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Trishulam Movie

  1. Pellante Pandillu Song Lyrics

Pellante Pandillu Song FAQ

What movie is Pellante Pandillu song from?

Pellante Pandillu song is from the Trishulam movie.

Who sang Pellante Pandillu song?

Pellante Pandillu song was sung by S P Balasubramanyam, P Susheela.

Who wrote Pellante Pandillu song lyrics?

Pellante Pandillu song lyrics were written by Acharya Athreya.

Who composed music for Pellante Pandillu song?

Pellante Pandillu song music was composed by KV Mahadevan.