| Movie Name | Folk song 1 (2025) |
|---|---|
| Director | Jodu Rama Sathyanarayana |
| Star Cast | Naga Durga & Raj Narendra |
| Music | Madeen SK |
| Singer(s) | Mamatha Ramesh |
| Lyricist | Bullet Bandi Laxman |
| Music Label |
సాంగ్ : పెద్ది రెడ్డి (Peddi Reddy)
సాహిత్యం: బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సంగీతం: మదీన్ (SK Madeen SK)
గాయని : మమత రమేష్ (Mamatha Ramesh)
తారాగణం : నాగ దుర్గ (Naga Durga) & రాజ్ నరేంద్ర (Raj Narendra)
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
కోరమీసాలు దువ్వుతూ మా నాయనా
కోరొక్క కూత పెడితేనే ఓ నాయనా
పెద్దప్పులంతా సప్పుడే మా నాయనా
తప్పే ఒప్పేసుకుంటారే…
ఊరంతా పెద్దోడు నా ముందు పసోడు పసోడు…
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
నేను పుట్టినప్పుడు మా నాయనా
నిండు అమాసనంటానే ఓ నాయనా
మా నాయనా మొఖం అప్పుడు
మా నాయనా పండు పున్నామంటనే
ఓ నాయనా నేను పుట్టినప్పుడు మా నాయనా
నిండు అమాసనంటానే ఓ నాయనా
మా నాయనా మొఖం అప్పుడు
మా నాయనా పండు పున్నామంటనే
మా నాయనా గుండె తొట్టెలా జేసి నన్ను ఉయ్యాల్లో ఊపేనంటనే..
పేరుగల్లా.. పేరుగల్లా..
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
పట్టా గొలుసులు తెచ్చెనే ఓ నాయనా
పెట్టి మురిసిపోయెనే మా నాయనా
పట్టు లంగాలు తెచ్చెనే ఓ నాయనా
కట్టి మురిసిపోయెనే మా నాయనా
పట్టా గొలుసులు తెచ్చెనే ఓ నాయనా
పెట్టి మురిసిపోయెనే మా నాయనా
పట్టు లంగాలు తెచ్చెనే ఓ నాయనా
కట్టి మురిసిపోయెనే మా నాయనా
మారాణి నేనైతే గుర్రమే తానై నా బారాలు అన్ని మోసేనే..
పేరుగల్లా.. పేరుగల్లా..
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
ఏడు ఊళ్లు చెప్పుకునేలా ఓ నాయనా
నా పెళ్లి చేసినాడులే మా నాయనా
కన్నీళ్లు దాచి గుండెల ఓ నాయనా
అక్షింతలేసినాడులే మా నాయనా
ఏడు ఊళ్లు చెప్పుకునేలా ఓ నాయనా
నా పెళ్లి చేసినాడులే మా నాయనా
కన్నీళ్లు దాచి గుండెల ఓ నాయనా
అక్షింతలేసినాడులే మా నాయనా
సిన్ననాడు తన సంక దిగితేనే నేను ఏడ్చినట్టు
ఏడ్చుకుంటానా చేతులు ఇడ్చానే..
పేరుగల్లా.. పేరుగల్లా..
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
నేను లేని ఇంటిలో మా నాయనా
కునుకే లేక కంటిలో పనుకుండే గాఢ నిద్రలో మా నాయనా
బాయిగడ్డ మీది మట్టిలో..
కడుపారగన్నోడు నా కడుపులో పుడితే
పెట్టుకుంటి ఆయన పేరునే..
పేరుగల్లా.. మా నాయనా..
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
పేరుగల్లా పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుకా
గావురాలే నన్ను జేసి పెంచేనే ఓ రామ సిలుకా
Peddi Reddy song is from the Folk song 1 movie.
Peddi Reddy song was sung by Mamatha Ramesh.
Peddi Reddy song lyrics were written by Bullet Bandi Laxman.
Peddi Reddy song music was composed by Madeen SK.