
| Movie Name | Seetharatnam Gari Abbayi (1992) |
|---|---|
| Director | E.V.V Satyanarayana |
| Star Cast | Vinod Kumar, Vanisree, Roja, Satyanarayana |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Lahari Music | T-Series |
పసివాడో ఏమిటో… ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో..!
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో… ఓ ఓ
పసివాడో ఏమిటో… ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు… ఊఊ ఊఉ
తాళెరుగనీ తల్లొక్కరు… తోడెరుగనీ మోడొక్కరు
కొడుకుండీ తండ్రవలేక… సతులుండీ పతి కాలేక
తన తలరాతకు తలవంచి… శిలలాగే బ్రతికేదొకరు
బంధాలే సంకెళ్లు వేయగా… బ్రతుకంతా చెరసాల లాగ మారగా
పసివాడో ఏమిటో… ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు… ఊఊ ఊఉ
చేజేతులా ఏ ఒక్కరు… ఏ నేరమూ చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు… ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు… అయినా అంతా పగవారు
ఇకనైనా ఈ మంటలారునా… ఇకనైనా ఈ జంట చెంత చేరునా
పసివాడో ఏమిటో… ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో..!
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో… ఓ ఓ
పసివాడో ఏమిటో… ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు… ఆఆ ఆ ఆ
Pasivado Emito song is from the Seetharatnam Gari Abbayi movie.
Pasivado Emito song was sung by S P Balasubramanyam.
Pasivado Emito song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Pasivado Emito song music was composed by Raj-Koti.