
| Movie Name | Mouna Geetham (1981) |
|---|---|
| Director | J Mahendran |
| Star Cast | Pratap Pothan, Suhasini |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Saregama Telugu |
పరువమా చిలిపి పరుగు తీయకు
పరువమా చిలిపి పరుగు తీయకు
పరుగులో పంతాలు పోవకు
పరుగులో పంతాలు పోవకు
పరువమా… చిలిపి పరుగు తీయకు
ఏ ప్రేమ కోసమో… చూసే చూపులు
ఏ కౌగిలింతకో… చాచే చేతులు
తీగలై, హొ… చిరు పూవులై పూయ
గాలిలో, హొ… రాగాలుగా మ్రోగ
నీ గుండె వేగాలు తాళం వేయ
పరువమా చిలిపి పరుగు తీయకు
ఏ గువ్వ గూటిలో… స్వర్గం ఉన్నదో
ఏ చెట్టు నీడలో… సౌఖ్యం ఉన్నదో
వెతికితే, హొ… నీ మనసులో లేదా
దొరికితే, హ… జత కలుపుకోరాదా
అందాక అందాన్ని ఆపేదెవరూ
పరువమా, ఆ ఆ… చిలిపి పరుగు తీయకు
పరుగులో పంతాలు పోవకు
పరుగులో పంతాలు పోవకు
పరువమా చిలిపి పరుగు తీయకు
Paruvama Chilipi Parugu song is from the Mouna Geetham movie.
Paruvama Chilipi Parugu song was sung by S P Balasubramanyam, S Janaki.
Paruvama Chilipi Parugu song lyrics were written by Acharya Athreya.
Paruvama Chilipi Parugu song music was composed by Ilayaraja.