| Movie Name | Akka Chellelu |
|---|---|
| Director | Akkineni Sanjeevi |
| Star Cast | ANR, Sowcar Janaki, Krishna, Vijaya Nirmala |
| Music | KV Mahadevan |
| Singer(s) | P Susheela |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
ఆ ఆ, పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారు అనుకున్నది
కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారు అనుకున్నది
జానకి అనుకున్నదీ
అయ్యో జానకి అనుకున్నదీ
శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నదీ
ఒళ్లంతా ఝల్లన్నదీ… ఓయమ్మా ఒళ్ళంతా ఝల్లన్నదీ
ఆ అహోయ్, పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
నవ మన్మధుని వంటి… నాధుని కనులారా
ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది
నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది
తుమ్మెదా ఉబలాటపడ్డది
ఒ హొయ్, తుమ్మెదా ఉబలాటపడ్డది
పెళ్ళి పీటల మీద… వెళ్ళి కూర్చున్నది
కళ్లలో కాని సిగ్గు కమ్మేసింది
ఓయమ్మా బుగ్గలకు పాకింది
హోయ్ ఓహొయ్, పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
నీ గుండెలోనె నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నీ గుండెలోనె నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నా నోముపంట పండాలీ
నా నోముపంట పండాలీ
రాముడే రాముడు… జానకే జానకని
ముందు వెనకందరూ… మురిసిపోవాలని
జానకి మొక్కుతూ… మొక్కుకుందీ
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
హే, పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
పంచ పాండవులోయమ్మా తుమ్మెదా
Pandavulu Pandavulu Thummeda song is from the Akka Chellelu movie.
Pandavulu Pandavulu Thummeda song was sung by P Susheela.
Pandavulu Pandavulu Thummeda song lyrics were written by Acharya Athreya.
Pandavulu Pandavulu Thummeda song music was composed by KV Mahadevan.