Padaniki Song Lyrics - Annamayya Cinema

Padaniki Song Lyrics - Annamayya Cinema
Padaniki Song Lyrics: Padaniki is a Telugu song from the film Annamayya Cinema starring Akkineni Nagarjuna, Suman, Ramya Krishnan, Mohan Babu, directed by K. Raghavendra Rao. "Padaniki" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, Renuka & Sujatha. Lyrics were written by Veturi Sundararama Murthy.

Padaniki Song Details

Movie NameAnnamayya Cinema
DirectorK. Raghavendra Rao
Star CastAkkineni Nagarjuna, Suman, Ramya Krishnan, Mohan Babu
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, Renuka & Sujatha
LyricistVeturi Sundararama Murthy
Music Label

Padaniki Song Lyrics in Telugu

ఓం, తెలుగు పదానికి జన్మదినం

ఇది జానపదానికి ఙ్ఞానపదం

ఏడు స్వరాలే ఏడుకొండలై

వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే

హరి ఖడ్గమ్మిది నందకము

బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి

నాదాశీస్సులు పొందినదై

శివలోకమ్మున చిద్విలాసమున

ఢమరుధ్వనిలో గమకితమై

దివ్యసభలలో నవ్యలాస్యముల

పూబంతుల చేబంతిగ ఎగసి

నీరదమండల నారద తుంబుర

మహతీగానపు మహిమలు తెలిసి

శితహిమకందర యతిరాట్సభలో

తపః ఫలమ్ముగ తళుకుమని

తల్లితనముకై తల్లడిల్లు

ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో

ప్రవేశించే ఆ నందకము

నందనానందకారకము

అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడుపోయగా

పద్మాసనుడే ఉసురుపోయగా

విష్ణుతేజమై నాదబీజమై

ఆంధ్రసాహితీ అమరకోశమై

అవతరించెను అన్నమయ

అసతోమా సద్గమయా

అవతరించెను అన్నమయ

అసతోమా సద్గమయా

పాపడుగా నట్టింట పాకుతూ

భాగవతము చేపట్టెనయా

హరినామమ్మును ఆలకించక

అరముద్దలనే ముట్టడయా

తెలుగుభారతికి వెలుగుహారతై

ఎదలయలో పదకవితలు కలయా

తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ

తమసోమా జ్యోతిర్గమయా

తమసోమా జ్యోతిర్గమయా

తమసోమా జ్యోతిర్గమయా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Annamayya Cinema Movie

  1. Kalaganti Kalaganti Song Lyrics
  2. Padaniki Song Lyrics

Padaniki Song FAQ

What movie is Padaniki song from?

Padaniki song is from the Annamayya Cinema movie.

Who sang Padaniki song?

Padaniki song was sung by S P Balasubramanyam, Renuka & Sujatha.

Who wrote Padaniki song lyrics?

Padaniki song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Padaniki song?

Padaniki song music was composed by M M Keeravani.