
| Movie Name | |
|---|---|
| Director | K. Balachander |
| Star Cast | Kamal Haasan, Saritha |
| Music | M.S.Viswanathan |
| Singer(s) | S Janaki |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం
చేసే చిలిపి పనులకు… కోటి దండాలు
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం
చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం
చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పరుపులు పరచిన… ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరుగాలులకు
పరుపులు పరచిన… ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరుగాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకూ, ఊఊ ఊ
కోటి దండాలు… శత కోటి దండాలు
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం
చేసే చిలిపి పనులకు కోటి దండాలు
నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే… నా పెదవులకు
నీకై చిక్కిన… నా నడుమునకు
కోటి దండాలు… శత కోటి దండాలు
భ్రమలో లేపిన… తొలి జాములకు
సమయం కుదిరిన… సందె వేళలకు
నిన్ను నన్ను కన్నవాళ్ళకు
నిన్ను నన్ను కన్నవాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకూ, ఊఊ ఊ
కోటి దండాలు… శత కోటి దండాలు
కోటి దండాలు… శత కోటి దండాలు
పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం
చేసే చిలిపి పనులకు కోటి దండాలు
కోటి దండాలు… శత కోటి దండాలు
Padaharellaku Neelo Naalo song is from the movie.
Padaharellaku Neelo Naalo song was sung by S Janaki.
Padaharellaku Neelo Naalo song lyrics were written by Acharya Athreya.
Padaharellaku Neelo Naalo song music was composed by M.S.Viswanathan.