
| Movie Name | Folk song 46 (2022) |
|---|---|
| Director | Anthadupula Nagaraju |
| Star Cast | Lucky and Kalyan Netha |
| Music | Kalyan keys |
| Singer(s) | Rambabu Yasarapu |
| Lyricist | Rambabu Yasarapu |
| Music Label |
Song: Paatammathone Pranam Naaku Chaduvulammara
Writer & Singer: Rambabu Yasarapu ( 9704069567 )
Music: Kalyan keys
Mixing: Balakrishna
Acting: Lucky and Kalyan Netha
Camera Editing: Shiva velpula
Producer: Perambudur Sudarshan Sahithi (Ganga)
Video sponsor: Anugu Laxma Reddy
Director : Anthadupula Nagaraju
Special Thanks: Ammapuram, kothagudem, kanapoor villagers
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన పేగు బంధం నేను రా
అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేను రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కను దారను నేను రా
ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలమూ దున్నలే
ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలమూ దున్నలే
కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం
కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం
చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయిన
చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయిన సదువమ్మా విలువ తెలిసీ ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన పేగు బంధం నేను రా
అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వ రా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేను రా
సిరిగిన అంగీ లాగులేసుకొని బాల్యమంత గడిపినా
బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా
సిరిగిన అంగీ లాగులేసుకొని బాల్యమంత గడిపినా
బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా
అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు
రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను గుండెల్లో దాసుకుండ్రు
ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్నా
ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్నా
ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మ
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన పేగు బంధం నేను రా
అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేను రా
కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా
కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా
మహనీయుల త్యాగాల దారిలో నా గొంతును వినిపిస్తా
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు ఊపిరి పాటౌతా
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు ఊపిరి పాటౌతా
చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై దారులు నేనేస్తా
జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకునౌతా
జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభూకునౌతా
సదువమ్మ బాటలో పాటను నేనై స్వేరో జెండాను గుండెకత్తుకుంటా
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన పేగు బంధం నేను రా
అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేను రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేను రా
Paatammathone Pranam Naaku Chaduvulammara song is from the Folk song 46 movie.
Paatammathone Pranam Naaku Chaduvulammara song was sung by Rambabu Yasarapu.
Paatammathone Pranam Naaku Chaduvulammara song lyrics were written by Rambabu Yasarapu.
Paatammathone Pranam Naaku Chaduvulammara song music was composed by Kalyan keys.