Osey Ramulamma Song Lyrics - Osey Ramulamma

Osey Ramulamma Song Lyrics - Osey Ramulamma
Osey Ramulamma Song Lyrics: Osey Ramulamma is a Telugu song from the film Osey Ramulamma starring Vijayasanthi, Dasarinarayana Rao, Krishna, Ramki, directed by Dasarinarayana Rao. "Osey Ramulamma" song was composed by Vandemataram Srinivas and sung by Swarnalatha, Vandemataram Srinivas. Lyrics were written by Suddala Ashok Teja.

Osey Ramulamma Song Details

Movie NameOsey Ramulamma (1997)
DirectorDasarinarayana Rao
Star CastVijayasanthi, Dasarinarayana Rao, Krishna, Ramki
MusicVandemataram Srinivas
Singer(s)Swarnalatha, Vandemataram Srinivas
LyricistSuddala Ashok Teja
Music LabelAditya Music

Osey Ramulamma Song Lyrics in Telugu

ఓ ముత్యాల రెమ్మా… ఓ మురిపాల కొమ్మ

ఓ పున్నామి బొమ్మ… ఓ పుత్తడి గుమ్మ

ఓ.. రాములమ్మా… రాములమ్మా…

ఏం చూపులోయమ్మ… ఏగు చుక్కనేనమ్మ

సిరి నవ్వులోయమ్మ… చంద్ర వంకలేనమ్మ

ఓ.. రాములమ్మా… రాములమ్మా…

నువ్వు కడవ మీద… కడవ బెట్టి కదిలించేనమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

ఆ కరిమబ్బు వరిదుబ్బు… కన్ను గిలిపెనమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

నువ్వు సిందు మీద సిందేసి… సెంగుమంటే నమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

ఆ జింక పిల్ల పాదాలకు… జంకు పుట్టేనమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

పరుగు పరుగు పాయలోన… పైకి పైకి తేలుతుంటే

నురగ తీరుగా ఉన్నావే… ఓ రాములమ్మ

విచ్చుకోని మొగ్గవోలె… పచ్చిపాల నిగ్గువోలె

ముచ్చటేసి పోతున్నవే… ఓ రాములమ్మ

వాగుల్లో వంకల్లో… ఆ సేలల్లో ఆ మూలల్లో

వాగుల్లో వంకల్లో… ఆ సేలల్లో మూలల్లో

నువ్వు పచ్చంగుండాలే… నువ్వు పదిలంగుండాలే

భూమి తల్లి సాక్షిగ… నువ్వు క్షేమంగుండాలే…

సూరిడే నీ వంక… తేరి చూసేనమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

అడుగేస్తే నేలంతా… అద్దమాయెనమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

పసిడి వన్నె ఒంటి మీద… పాడు చూపు పడకుండా

పసుపు పూసినారే అమ్మలు… ఓ రాములమ్మ

చిట్టి వయసు పారిపోయే… సిగురు వయసు చేరెనని

చీర కట్టిన్నారే గుమ్మలు… ఓ రాములమ్మ

దొరగారి దొరసాని దీవెనల కోసమని

ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని

కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా

మూడు కుంచాలిస్తే… నిలువెత్తు పొంగినావమ్మా…

దొరగారి పై ఊగే పంక వైనావమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

దొరసాని కాల్లొత్తే… దూది వైనావమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

దేవిడినే వెలిగించే… దివ్వే వైనావమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా…

నలుగురికి తల్లోని… నాల్కవైనావమ్మా…

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

చీకటింట బిక్కుమంటు.. కలత పడ్డ కళ్ళల్లోన

బాకులాంటి ఎలుగు మెరిసెనా… ఓ రాములమ్మ…

మూగ బడ్డ వెదురులోన… ముచ్చటైన రాగాలూదే

ముద్దులయ్య చెయ్యి దొరికేనా… ఓ రాములమ్మ

కష్టాలు కన్నీళ్లు… ఉంటాయా చానాళ్ళు

కష్టాలు కన్నీళ్లు… నిలిచి ఉంటాయా చానాళ్ళు

ఇంకా పొదలు మాటు… పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ

గుబులే లేని గువ్వల్లగా… ఎగరాలోయమ్మ…

పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

పూసేటి పూలన్ని… పోసే తలంబ్రాలమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

కోయిలల సందడ్లే… సన్నాయి మేళాలమ్మ

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

ఓ ఓ… ఒసేయ్ రాములమ్మా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Osey Ramulamma Movie

  1. Osey Ramulamma Song Lyrics

Osey Ramulamma Song FAQ

What movie is Osey Ramulamma song from?

Osey Ramulamma song is from the Osey Ramulamma movie.

Who sang Osey Ramulamma song?

Osey Ramulamma song was sung by Swarnalatha, Vandemataram Srinivas.

Who wrote Osey Ramulamma song lyrics?

Osey Ramulamma song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Osey Ramulamma song?

Osey Ramulamma song music was composed by Vandemataram Srinivas.