
| Movie Name | Love Reddy (2024) |
|---|---|
| Director | Smaran Reddy |
| Star Cast | Anjan Ramachendra , Shravani Krishnaveni |
| Music | Prince Henry |
| Singer(s) | Haricharan & Lipsika Bhashyam |
| Lyricist | Suresh Banisetti |
| Music Label | Sony Music Entertainment India Pvt. Ltd. |
ఓ సాథియా సాథియా
నిన్ను చూడగా దిల్ దియా
ఓ సాథియా సాథియా
నా నిద్దరే చల్ గయా
నీ పేరులో తీపిని తీసా
నా పెదవులకతికించేసా
ప్రతి మాట తీపవ్వాలని ఆశ
నీ ఊహలు రెక్కలు చేసా
నా మనసుకు తొడిగించేసా
తొలి ప్రేమాకాశం లో ఎగిరేశా
ఎన్నో ఎన్నో చెప్పాలని
కన్నానులే కల
నిజం నిజం చెయ్యాలని
వచ్చానులే ఇలా..
ఊరికే ఊరిస్తుంటావే
ఊపిరే తీసేస్తుంటావే
ఇంకెంతకాలం నన్నీలా
ఉడికిస్తుంటావే వెన్నెల
ఇంకెన్నేనేళ్లు నేనిలా
నీ వెనకాలే తిరగాలో చెప్పు నీడలా
కాసింత కరుణే లేదా
కూసంత పంతం పోదా
నా బాధ అర్ధం కానే కదా
ఓ సారి ఊ అనలేవా
అందంగా అల్లుకుపోవా
చిరునవ్వుని కొంచెం విదిలిస్తావా
ఎన్నో ఎన్నో చెప్పాలని
కన్నానులే కల
నిజం నిజం చెయ్యాలని
వచ్చానులే ఇలా..
ప్రాణం ముందుకు తోస్తుంటే
మౌనం వెన్నక్కి లాగ్గిందే
అరె ఎవరున్నారో
నా కళ్ళలోన చూసుకో
ఆ చూసే చూపే మైమరిపిస్తుందా
ఏ బొమ్మేసానో గుండెలో
తెలియాలంటే నువ్వొచ్చి
నాలో నిండిపో..
ఎన్నో ఎన్నో చెప్పాలని
కన్నానులే కల
నిజం నిజం చెయ్యాలని
వచ్చానులే ఇలా..
Oo Saathiya Video song is from the Love Reddy movie.
Oo Saathiya Video song was sung by Haricharan & Lipsika Bhashyam.
Oo Saathiya Video song lyrics were written by Suresh Banisetti.
Oo Saathiya Video song music was composed by Prince Henry.