
| Movie Name | Sunitha Navratri Special |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Dr Josyabhatla |
| Singer(s) | Sunitha |
| Lyricist | Naga Gurunatha Sarma |
| Music Label |
ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటి విద్యలకు మూలం
నీవె చదువులమ్మా
(ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటి విద్యలకు మూలం
నీవె చదువులమ్మా)
పలుకులన్ని హంసలై… పరవశించి ఆడగా
భాషలు నీ చూపులై… పరిమళించి పాడగా
(పలుకులన్ని హంసలై… పరవశించి ఆడగా
భాషలు నీ చూపులై… పరిమళించి పాడగా)
వీణానాదమై అక్షరవేదమై
సరస్వతిగ మాలో ప్రవహించవమ్మా
ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటి విద్యలకు మూలం
నీవె చదువులమ్మా
చేతవెన్నముద్దలోన… చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన… శ్రీగంగ నురగలోన
(చేతవెన్నముద్దలోన… చలువ చందమామలోన
చిన్నారి నవ్వులోన… శ్రీగంగ నురగలోన)
తెల్లదనం నీవు… తెలివిలోన నీవు
తలచిన హృదయాలే గుడులైనవమ్మా
ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటి విద్యలకు మూలం
నీవె చదువులమ్మా
(ఓనమాలు పూవులై
ఒదిగిన ఓ కొమ్మా
కోటి విద్యలకు మూలం
నీవె చదువులమ్మా)
Onamalu Poovulai song is from the Sunitha Navratri Special movie.
Onamalu Poovulai song was sung by Sunitha.
Onamalu Poovulai song lyrics were written by Naga Gurunatha Sarma.
Onamalu Poovulai song music was composed by Dr Josyabhatla.