| Movie Name | ( 1 ) In & English |
|---|---|
| Director | Vamsy |
| Star Cast | Rajendra Prasad, Shobhana |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
టురురు రుట్టురు… టురురు రుట్టురు
టురురు రుట్టురు రు రు రూ
టురురు రుట్టురు… టురురు రుట్టురు
టురురు రుట్టురు రు రు రూ
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ… ముడివేయనీయవా
కాదని అనలేననీ… ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని… ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
(మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతం
త్వంజీవ శరదశ్శతం… త్వంజీవ శరదశ్శతం)
(లాలిలాలి లాలి… లాలిలాలి లాలి
లాలీ లాలీ… లాలీ లాలీ)
కాంక్షలో కైపు నిప్పు… ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా… మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం… గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం… మరయాగ వాటిక
కాలమే కాలిపోయే… ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే… మూర్తమే చూడవా
ఓఓ ఓఓ ఓఓఓ ఓఓఓ, ఆ ఆఆ ఆ ఆ
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
నిష్టగా నిన్ను కోరీ… నియమమే దాటినా
కష్టమే సేదతీరే… నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే… జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే… నిశ్చయం మెచ్చనా
సోయగం సొంతమయ్యే… స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే… అమృతం అందుకో
ఓఓ ఓఓ ఓఓఓ ఓఓఓ, ఆ ఆఆ ఆ ఆ
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి… సొంపుల వాకిలి
ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి
ఎందుకు పోకిరి చాలు మరీ, హా ఆ ఆఅ
Ompula Vaikari song is from the ( 1 ) In & English movie.
Ompula Vaikari song was sung by S P Balasubramanyam, KS Chitra.
Ompula Vaikari song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Ompula Vaikari song music was composed by Ilayaraja.