| Movie Name | Muthu (1996) |
|---|---|
| Director | KS Ravikumar |
| Star Cast | Rajinikanth, Meena, Sarath Babu |
| Music | AR Rahman |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Aditya Music |
ఓహో, ఎహె ఎహె ఎహె ఏ హే ఏ హే
ఓహో ఓ హో ఓహో ఓహో
హె ఎహె ఏ హే ఏ హే
ఓ హో ఓహో ఓహో హో హో
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం… మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
(సైయ్య సైయ్యారే… సైయ్యారే సైయ్యా
హే హే హే ఏ హెహె
సైయ్య సైయ్యారే… సైయ్యారే సైయ్యా
సైయ్య సైయ్యారే… సైయ్యారే సైయ్యా
సైయ్య సైయ్యారే… సైయ్యారే సైయ్యా)
మట్టి మీద మనిషికి ఆశ
మనిషి మీద మట్టికి ఆశ
మట్టి మీద మనిషికి ఆశ
మనిషి మీద మట్టికి ఆశ
మన్నే చివరికి గెలిచేది
అది మరణంతోనే తెలిసేదీ
కష్టం చేసి కాసు గడిస్తే
నీవే దానికి యజమాని
కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే
డబ్బే నీకు యజమాని
జీవిత సత్యం మరవకురా
జీవితమే ఒక స్వర్గమురా
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు
వాన మనది… ప్రకృతి మనదీ
తన పర బేధం… ఎందుకు వినరా
వాన మనది… ప్రకృతి మనది
తన పర బేధం… ఎందుకు వినరా
కాల చక్రం నిలవదురా
ఈ నేల స్వార్ధం ఎరగదురా
పచ్చని చెట్టు… పాడే పక్షి
విరులు ఝరులు ఎవ్వరివీ
మంచిని మెచ్చే… గుణమే ఉంటే
ముల్లోకాలు అందరివి
జీవితమంటే పోరాటం
అది మనకే తీరని ఆరాటం
ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
హా, ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు
Okade Okkadu Monagadu song is from the Muthu movie.
Okade Okkadu Monagadu song was sung by S P Balasubramanyam.
Okade Okkadu Monagadu song lyrics were written by Bhuvana Chandra.
Okade Okkadu Monagadu song music was composed by AR Rahman.