
| Movie Name | Bunny Vox |
|---|---|
| Director | Suneel Reddy |
| Star Cast | Bunnyvox, Varun Babu |
| Music | The Fantasia Men |
| Singer(s) | Haricharan & Harini Ivaturi |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Bunny Vox (YouTube) |
సూటిగా చెప్పలేను
చాటుగా దాచలేను
తీరనీ ప్రేమ నేను
నిన్నెలా చేరుకోను
ఎందుకొచ్చావో నువ్వు నాలోకి
వేల రంగుల్లోన వెలిగానే
ఊపిరిచ్చావే గుండెలోగిలికి
వెండిమబ్బుల్లోన తిరిగానే
నిమిషమైన నిను వదిలి
నిలువలేని మనసు ఇది
తనను తానే మరచినది
రెండుగా చీలని ఆకాశం
ముక్కలై పేలని భూగోళం
ఎన్నడూ నేనిలా టెన్ టు ఫైవ్
నీ కోసం ఉండనా
ఓ పిల్ల నువ్వంటే ఇష్టమే
ఓ పిల్ల నువ్వంటే ప్రాణమే
ఓ పిల్ల నా గుండెలోతుల్లో
చెరగని కల నువ్వే
ఓ పిల్ల నా వంక చూడవే
ఓ పిల్ల నా జంట చేరవే
ఓ పిల్ల నా బుజ్జి గుండెలో
నవ్వు ఊహించలే
రెప్పలేని కంటి పాపై
చెలియా నిను చూస్తున్న
అంతులేని నీ మౌనమే
నిలువునా కాల్చినా
నింగి తీరాన చందమామ నువ్వు
నేల దారుల్లో గడ్డిపువ్వు నేను
అయ్యో దూరం చాలానే
నీతో నేను సరిపోనే
అయినా నిను ప్రేమించానే
కురిసే నీ సిరి వెన్నెలనడిగానే
పువ్వులా కోరుకున్న
ముల్లుగా గుచ్చుకోకే
ప్రేమగా వేడుకొన్న
కాదనీ వెళ్ళిపోకే
చిట్టచీకటిగుందే… ఏమి తోచకుందే
చెంత నువ్వు లేని లోటుగా టెన్ టు ఫైవ్
మనసు ఆగనందే… మార్గం ఏమిటందే
మరల నిన్ను చేరగా టెన్ టు ఫైవ్
కనులముందే ఉన్న నిన్ను
చూసి చూడనే లేదుగా
కన్నా నిన్ను వదులుకున్నా
నేరమంతా నాదేగా
ఓ ప్రేమ నువ్వంటే ఇష్టమే
ఓ ప్రేమ నువ్వంటే ప్రాణమే
ఓ ప్రేమ నువ్వేంటో తెలియక
పొరపాటే అయినది
ఓ ప్రేమ నా బాధ చూడవే
ఓ ప్రేమ నా చెంత చేరవే
ఓ ప్రేమ పిచ్చి ప్రేమలు
మన్నించవే, ఓ ప్రేమా
Oh Pilla song is from the Bunny Vox movie.
Oh Pilla song was sung by Haricharan & Harini Ivaturi.
Oh Pilla song lyrics were written by Ramajogayya Sastry.
Oh Pilla song music was composed by The Fantasia Men.