| Movie Name | Prematho (2019) |
|---|---|
| Director | |
| Star Cast | Shahrukh Khan |
| Music | AR Rahman |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా
పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...
ఓ ప్రియతమా బదులీయమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా
జ్ఞాపకాన్ని ఈ గాలి అలా రేపుతుంటే ఆపేది ఎలా
ఈ గాలి ఎలా ఆపేది ఎలా
నాటి చంద్రకళ నేను కన్న కల
కాదంటే నమ్మలేదే
ఉందంటే ఏది అందే
ఓసారి చూపమందే
ఆ స్మృతినే ఆకృతిగా చూడలేనా
ఓ ప్రియతమా బదులీయుమా, ఏ చోట నీవు ఉన్నా
నీ పాటనై నలువైపులా నీ జాడ వెతుకుతున్నా
పల్లవే నువ్వని పలవరించే
చరణం ఎక్కడో పలకరిస్తే
చెప్పమ్మా తను కోరే చిరునామా...