
| Movie Name | Chanti Cinema |
|---|---|
| Director | Ravi Raja Pinisetty |
| Star Cast | Venkatesh, Meena |
| Music | Ilayaraja |
| Singer(s) | Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఓ ప్రేమా… నా ప్రేమా
దైవాలాడే జూదం
దయ్యం పాడే వేదం
ఓ ప్రేమా… నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం
దయ్యం పాడే వేదం
రక్తంలోని సుడిగుండం
రాయై పోయే అనుబంధం
ఓ ప్రేమా… నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
క్షణమొక యుగముగ… గడిపిన బ్రతుకిది
తెలుసుకో ప్రియతమా..!
విరహమే సుఖమని… కలయిక కలయని
కలచుటే మధురమా..!!
మృతులకు చితులకు ముగియని కధలివి
కదలిరా ప్రణయమా..!
అడుగులు చిలికిన… రుధిరపు మడుగుల
ఎరుపులే ప్రళయమా..!!
జారిపోయే కాలం… చేజారిపోయే యోగం
రగులుతున్న గాయం…. నే నడగలేను న్యాయం
కరువవుతాను కన్నుల్లో…. గురుతుంటాను గుండెల్లో
ఓ ప్రేమా… నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం
దయ్యం పాడే వేదం
రక్తంలోని సుడి గుండం
రాయై పోయే అనుబంధం
ఓ ప్రేమా… నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
గిరులను విడిచిన… నదులిక వెనుకకు
తిరుగునా జగమున
కులమని కడుదని… కులమని విలువలు
చెరుగునా మనసున
గగనము మెరుపుల… నగలను తొడిగితే
ఘనతలే పెరుగునా
ఉరుములు వినపడి… ఉదయపు వెలుగులు
అదురునా చెదురునా
పేదవాళ్ళ ప్రేమ… కాటువేసే పామా
స్వాగతాలు అనగా… చావుకైనా ప్రేమా
మానై నేను బ్రతికున్నా… మనిషై నేను చస్తున్నా
ఓ ప్రేమా… నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
దైవాలాడే జూదం
దయ్యం పాడే వేదం
రక్తంలోని సుడి గుండం
రాయై పోయే అనుబంధం
ఓ ప్రేమా… నా ప్రేమా
ప్రేమిస్తే చావేనా
O Prema Na Prema Female song is from the Chanti Cinema movie.
O Prema Na Prema Female song was sung by Chitra.
O Prema Na Prema Female song lyrics were written by Veturi Sundararama Murthy.
O Prema Na Prema Female song music was composed by Ilayaraja.