
| Movie Name | Ee Kathalo Nenu |
|---|---|
| Director | M. S. Phaniraj |
| Star Cast | Homanand, Simran Pareenja |
| Music | Yogeshwara Sharma |
| Singer(s) | Usha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
నువ్వున్నది నీ లోకం
కాదేమో అనిపిస్తుంది
మునుపెరుగని ఏవో
రంగులతో నిను కమ్మేస్తుంది
నిదరేదో మెలుకువ ఏదో
తేడా చెరిపేస్తుంది
ఇంకా కావాలనిపించే
కలతను కలిగిస్తుంది
మదిలోపలి ఊసుల సడి
వినగలిగే ఆలన ప్రేమా
నీ కలలకు కమ్మని
జోలలు పాడే లాలన ప్రేమ
నీ రాగల రోజుల కోరుకునే
పరిపాలన ప్రేమ
నీ అనురాగానికి శృతి కలిపే
ఆలాపన ప్రేమ
కొంచం కొంచం నిను కరిగిస్తుంది తనలో
అణువు అణువు తను కొలువవుతుంది నీలో
ఏమయ్యావు అని అడిగితే ఏం చెబుతావు
నీకై నీవు అన్వేషిస్తూ ఉంటావు
నిను ఏ గాలో మేఘాల్లో విసిరేస్తుంటే
ఆ వేగంలో నువు అటు ఇటు అయిపోతుంటే
నిను కుదురుగ నిమిషం కూడా
నిలబడనివ్వదు ప్రేమా
నీ ఎదురుగ ఎవ్వరు ఉన్నా
కనబడనివ్వదు ప్రేమ
నువ్ ఎటు సాగాలో
ఎపుడాగాలో చెప్పదు ప్రేమ
నిను నిలువెల్లా ఒక ఆటాడించే
అల్లరి ప్రేమా
అడిగావు అలా నిను అల్లింది అనుబంధం
వద్దనుకున్నా వదిలేనా ఆజన్మాంతం
ఎప్పటి ఋణమో చెప్పరుగా ఎవరు సాక్ష్యం
ఇప్పుడు ఇదిగో ఎదురైంది అదే అనుకుందాం
వేటంటారా వెంటాడే పూ బాణాన్ని
చేదంటారా చెయ్యందించే స్నేహాన్ని
నీ మనసుకి వయసొచ్చిందని
తెలిపే కిరణం ప్రేమ
నీ వయసుకి మనసిస్తాని
పలికే తరుణం ప్రేమ
ఆకాంక్షలు ఆకాశానికి అంటే
అలజడి ప్రేమ
ఏ ఆంక్షలు ఆపని
ఆశల వెల్లువ కాదా ప్రేమ
Nuvvunnadi Nee Lokam song is from the Ee Kathalo Nenu movie.
Nuvvunnadi Nee Lokam song was sung by Usha.
Nuvvunnadi Nee Lokam song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nuvvunnadi Nee Lokam song music was composed by Yogeshwara Sharma.