
| Movie Name | |
|---|---|
| Director | K.Vaasu |
| Star Cast | Vijay Chandar, Chandra Mohan, Anjali Devi |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Aditya Music |
సాయిబాబా… సాయిబాబా
సాయినాధా… సాయిదేవా
సత్యం నిత్యం నీవే కావా
నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
బాబా… ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం
బ్రతుకంతా అయోమయం, బాబా ఓ బాబా
మా పాలి దైవం అని… మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి
మా ఆర్తి చూస్తావని… సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి
శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
ఏ దైవమైనా ఏ ధర్మమైనా
నీలోనే చూచాము సాయి
రావా బాబా రావా
రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
బాబా… ఓ బాబా
మా ఏసు నీవేనని… మా ప్రభువూ నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే
అల్లాగ వచ్చావని… చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా… గురుగోవిందైనా
గురుద్వారమైనా… నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి
రావా బాబా రావా
రక్షా దక్షా నీవే కదా మా బాబా
నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం… బ్రతుకంతా అయోమయం
బాబా… ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం
బ్రతుకంతా అయోమయం, బాబా ఓ బాబా
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి
(కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి)
అల్లాసాయి మౌలాసాయి
(అల్లాసాయి మౌలాసాయి)
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం
(నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం)
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
సాయి సాయి బాబా సాయి
Nuvvu Leka Anadalam song is from the movie.
Nuvvu Leka Anadalam song was sung by S P Balasubramanyam.
Nuvvu Leka Anadalam song lyrics were written by Acharya Athreya.
Nuvvu Leka Anadalam song music was composed by Ilayaraja.