
| Movie Name | & English - Rowdy Boys (2022) |
|---|---|
| Director | Harsha Konuganti |
| Star Cast | Ashish, Anupama Parameswaran |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Karthik |
| Lyricist | Shree Mani & Ananth Sriram |
| Music Label | Aditya Music |
నేనేంటో నాకే తెలిపి
నను నడిపిన వెలుగే నువ్వే
నా కల ఒక నిజముగ చూసిన
స్నేహమే నువ్వే
నా అడుగులు ఎటు వెయ్యాలో
చూపించిన దారే నువ్వే
నా గెలుపుని ముందే చూసిన
ప్రేమవే నువ్వే
నా గుండెలో నీ మాటలన్నీ
పాటలాగా మార్చింది నువ్వే
ఏ అర్ధం లేని పుస్తకాన్ని
నాకంటూ అర్ధం ఉందని చెప్పింది నువ్వే
నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ
నీ పరిచయం
పరిచయం చేసింది నాకు చిరునవ్వుని
నీ మనసుతో
మనిషిగా చిక్కింది నన్ను మారమని
ఆ తగువులే చదువులై
నేర్పాయి నాకు పాఠాలని
ఆ క్షణములే స్వరములై
పాడాయి ప్రేమ పాటలని
ఏ గీతలేని కాగితంపై
ఈరోజీరాత రాసింది నువ్వే
ఏ రంగు లేని జీవితంపై
వర్షంలా వర్ణాలెన్నో చల్లేసెళ్ళావే
నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా ధైర్యం, ఓ ఓ ఓఓ
నువ్వే నా సైన్యం, ఓ ఓ ఓఓ
Nuvve Na Dhairyam song is from the & English - Rowdy Boys movie.
Nuvve Na Dhairyam song was sung by Karthik.
Nuvve Na Dhairyam song lyrics were written by Shree Mani & Ananth Sriram.
Nuvve Na Dhairyam song music was composed by Devi Sri Prasad.