| Movie Name | (Yuvaraju) In & English |
|---|---|
| Director | YVS Chowdary |
| Star Cast | Mahesh Babu, Simran, Sakshi Shivanand |
| Music | Ramana Gogula |
| Singer(s) | Shankar Mahadevan & Nanditha |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఆ ఆఆ ఆ ఆ ఆ
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఏ నెల్లో నే తప్పను
మన ఊరోళ్ళకేం చెప్పను
మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్ళు అని చెప్పుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
ఆ ఆఆ ఆ ఆ ఆ
ఓలొ ఓలమ్మోలాల… కోకే కాకెత్తుకు పోతే
రైకే నీ సాయం కోరే వానకాలంలో
కూతలేమో కొయ్యకులే చేతల్లో చూపించేయ్
దమ్ముంటే చెంతకు చేరి… అంతా దోచుకుపో
వాయిదాలు చెల్లవింక వానాకాలంలో
ఇక రేయిపగలు లేనే లేవు ప్రేమాకాలంలో
సిగ్గులన్ని భగ్గుమన్న… శీతాకాలంలో తోవ
లగ్గమెట్టి దగ్గరవ్వు రామాకాలంలో
హే, చూపుల్తో చిక్కొచ్చింది
చూడందే పిచ్చెక్కింది
మొగ్గొచ్చి పువ్వును తట్టింది
వెన్నెల్లో నువ్వే గొడుగేసుకో
జడి వానల్లో తలదాచుకో
హేయ్, కన్నుల్లో నువ్వే కల దాచుకో
బిగి కౌగిట్లో చలి కాచుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా
కొక్కొరొకో, కొక్కరకోల కోడై ఈడు కూసే రోజుల్లో
మనం కుక్కిమంచం కూని రాగం తీసే వేళల్లో
జాజిమల్లే జాగారాలు చేసే ప్రాయంలో
జామురాతి జాబిలమ్మ ఆడే బేరంలో
హే, మాటల్తో అలుపొచ్చింది
చేతలకే పిలుపొచ్చింది
పిట్టొచ్చి పండును కొట్టింది
మరదళ్ళ తనము వచ్చేసింది
తిరగల్లో నడుమే గిచ్చేసింది
హెయ్, అరచేయిని నువ్వే గిల్లేసుకో
తొలి రేయంతా అల్లేసుకో
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
హేయ్ పిల్ల కోకలిస్తే సోకులు ఇస్తావా
సర రైకలిస్తే రాతిరికొస్తావా
నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఏ నెల్లో నే తప్పను
మన ఊరోళ్ళకేం చెప్పను
అబ్బ, మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్ళు అని చెప్పుకో
Nookalisthe Mekalu song is from the (Yuvaraju) In & English movie.
Nookalisthe Mekalu song was sung by Shankar Mahadevan & Nanditha.
Nookalisthe Mekalu song lyrics were written by Veturi Sundararama Murthy.
Nookalisthe Mekalu song music was composed by Ramana Gogula.