
| Movie Name | Adbutham (2000) |
|---|---|
| Director | Saran |
| Star Cast | Ajith Kumar, Shalini, Raghuvaran, Raadhika |
| Music | Ramani Bharadwaj |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Saregama Telugu |
నిత్యం ఏకాంత క్షణమే అడిగా, ఆ ఆ
యుద్దం లేనట్టి లోకం అడిగా, ఆ ఆ
రక్తతరంగ ప్రవాహం అడిగా, ఆ ఆ
ఉదయం లాంటి హృదయం అడిగా, ఆ ఆ
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
నిత్యం ఏకాంత క్షణమే అడిగా
యుద్దం లేనట్టి లోకం అడిగా
రక్త తరంగ ప్రవాహం అడిగా
ఉదయం లాంటి హృదయం అడిగా
అనుబంధాలకు ఆయుష్షడిగా
ఆనందాక్ష్యులకు ఆశీస్సడిగా
మదినొప్పించని మాటలు అడిగా
ఎద మెప్పించే యవ్వనమడిగా
పిడుగులు రాల్చని మేఘం అడిగా
జ్వలించు నూరేళ్ళ పరువం అడిగా
వరించు తరించు వలపే అడిగా
ప్రాణతుల్యమౌ బంధం అడిగా
పచ్చికలో మంచు ముత్యాలడిగా
పువ్వుల ఒడిలో పడకే అడిగా
తనువోదార్చే ఓర్పును అడిగా
తలనే నిమిరే వేళ్ళను అడిగా
నెమలి ఆటకు పదమే అడిగా
కోయిల పాటకు పల్లవి అడిగా
గదిలో గుక్కెడు నీళ్ళే అడిగా
మదిలో జానెడు చోటే అడిగా
మచ్చంటు లేని జాబిలినడిగా
నక్షత్రకాంతి నట్టింటడిగా
దుఃఖం వదించు అస్త్రం అడిగా
అస్త్రం ఫలించు యోగం అడిగా
చీకటి ఊడ్చే చీపురునడిగా
పూలకు నూరేళ్ళామని అడిగా
మానవ జాతికి ఒక నీతడిగా
వెతల రాత్రికే వేకువనడిగా
ఒకటే వర్ణం సబబని అడిగా
ఒక అనురాగం గుడిలో అడిగా
వాలని పొద్దున నెలవంకడిగా
ప్రాణముండగా స్వర్గం అడిగా
న్యాయం ధర్మం ఇలలో అడిగా
ఎద రగిలించే కవితే అడిగా
కన్నీరెరుగని కన్నే అడిగా
క్షామం నశించు కాలం అడిగా
చుక్కలు దాటే స్వతంత్రమడిగా
దిక్కులు దాటే విహంగమడిగా
తొలకరి మెరుపుల నిలకడనడిగా
ఎండమావిలో ఏరును అడిగా
మూగపాటకొక చరణం అడిగా
మౌనభాష వ్యాకరణం అడిగా
నమ్మి చెడని ఓ స్నేహం అడిగా
శాంతిని పెంచే సంపదనడిగా
వస్తే వెళ్ళని వసంతం అడిగా
ఏడేడు జన్మలకు ఒక తోడడిగా
ఏనాడు వాడని చిరునవ్వడిగా
ముసిరే మంచుల ముత్యాలడిగా
ముసిముసి నవ్వుల ముగ్గులు అడిగా
ఆశల మెరుపుల జగమే అడిగా
అంధకారమా పొమ్మని అడిగా
అందరి ఎదలో హరివిల్లడిగా
మరుగై పోని మమతను అడిగా
కరువైపోని సమతను అడిగా
రాయలంటి కవి రాజును అడిగా
బమ్మెర పోతన భక్తిని అడిగా
భారతి మెచ్చిన తెలుగే అడిగా
పాశుపతాస్త్రం నరుడై అడిగా
మోహన కృష్ణుడి మురళే అడిగా
మధుర మీనాక్షి చులకే అడిగా
ఉన్నది చెప్పే ధైర్యం అడిగా
ఒడ్డెక్కించే పందెం అడిగా
మల్లెలు పూసే వలపే అడిగా
మంచిని పెంచే మనసే అడిగా
పంజా విసిరే దమ్మే అడిగా
పిడుగుని పట్టే ఒడుపే అడిగా
ద్రోహం అణిచే సత్తానడిగా
చస్తే మిగిలే చరిత్రనడిగా
విధిని జయించే ఓరిమిని అడిగా
ఓరిమిలో ఒక కూరిమిని అడిగా
సహనానికి హద్దేదని అడిగా
దహనానికి అంతేదని అడిగా
కాలం వేగం కాళ్ళకు అడిగా
చిన్నా చితక జగడాలడిగా
తియ్యగా ఉంటే గాయం అడిగా
గాయానికి ఒక ధ్యేయం అడిగా
పొద్దేవాలని ప్రాయం అడిగా
ఒడిలో శిశువై చనుబాలడిగా
కంటికి రెప్పగ తల్లిని అడిగా
ఐదో ఏట బడినే అడిగా
ఆరో వేలుగా పెన్నే అడిగా
ఖరీదు కట్టని కరుణే అడిగా
ఎన్నని అడగను దొరకనివి
ఎంతని అడగను జరగనివి
ఎవ్వరినడగను నా గతిని
కళ్ళకు లక్ష్యం కలలంటూ
కాళ్ళకు గమ్యం తాడంటూ
భగవధ్గీత వాక్యం వింటూ
మరణం మరణం శరణం అడిగా
ఆ ఆఆ ఆ… ఏ ఏ ఏ ఏ ఏ
FAQs & TRIVIA
Nityam Ekanta Kshaname Adiga song is from the Adbutham movie.
Nityam Ekanta Kshaname Adiga song was sung by S P Balasubramanyam, Chitra.
Nityam Ekanta Kshaname Adiga song lyrics were written by Veturi Sundararama Murthy.
Nityam Ekanta Kshaname Adiga song music was composed by Ramani Bharadwaj.