
| Movie Name | Meet Cute (Star Struck), Sony LIV |
|---|---|
| Director | Deepthi Ghanta |
| Star Cast | Adah Sharma, Alekhya Harika, Shiva Kandukuri |
| Music | Vijay Bulganin |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Sony Music South |
నింగే ఏలే తారే
మరి నేలే వాలే నేడే
అన్నీ కొత్తేనేమో
చిగురించే స్నేహంలోనే
చేయే చాచే చనువేదో
మోమాటంతో ఆగే
అయినా మనసే పర్లేదంటూ
సైగే చేసేలే
కొత్త కొత్త పరిచయమే
గుండెలోకి చేరెనుగా
మరువలేని కలయికగా
మారుతోందిగా
ఇద్దరున్న ఏకాంతం
ఒక్కచోటే ఎంతందం
మాటకన్న మౌనాలే
నచ్చుతుండగా
జాడే లేవే సంకోచాలు
మాయే టెన్ టు ఫైవ్ ఏం చేసావే
నన్నే మూగే సందేహాలు దరికే రావే
కన్నుల్లోనే దాచాలేమో ఈ కాలాలు
వచ్చేలోపే ఆపాలేమో ఇక దూరాలు
తలపే లేని తరుణం బాగుందే
చూసినట్టు రూపం… గుర్తు రాదు పాపం
ఇంతలోనే వచ్చేస్తుందే గుండెలోనికే
మారినాక వేషం… తేలికాయే స్నేహం
చిన్న నవ్వుతోనే లాగుతోంది నన్నే
మబ్బులు వీడిపోయాయి గనుక
హద్దులు ఆగుతున్నాయి వెనక
ఇద్దరిలోను మౌనాలు దాగేలే
కొత్త కొత్త పరిచయమే
గుండెలోకి చేరెనుగా
మరువలేని కలయికగా
మారుతోందిగా
ఇద్దరున్న ఏకాంతం
ఒక్కచోటే ఎంతందం
మాటకన్న మౌనాలే
నచ్చుతుండగా
జాడే లేవే సంకోచాలు
మాయే ఏం చేసావే
నన్నే మూగే సందేహాలు దరికే రావే
కన్నుల్లోనే దాచాలేమో ఈ కాలాలు
వచ్చేలోపే ఆపాలేమో ఇక దూరాలు
తలపే లేని తరుణం బాగుందే
నింగే ఏలే తారే
మరి నేలే వాలే నేడే
అన్నీ కొత్తేనేమో
చిగురించే స్నేహంలోనే
చేయే చాచే చనువేదో
మోమాటంతో ఆగే
అయినా మనసే పర్లేదంటూ
సైగే చేసేలే
Ningey Yeley Thaarey song is from the Meet Cute (Star Struck), Sony LIV movie.
Ningey Yeley Thaarey song was sung by Anurag Kulkarni.
Ningey Yeley Thaarey song lyrics were written by Krishna Kanth.
Ningey Yeley Thaarey song music was composed by Vijay Bulganin.