
| Movie Name | & English - Muthyala Muggu |
|---|---|
| Director | Bapu |
| Star Cast | Sreedhar, Sangeeta, Rao Gopal Rao |
| Music | KV Mahadevan |
| Singer(s) | P Susheela |
| Lyricist | Gunturu Seshendra Sharma |
| Music Label | Saregama Music |
నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది
రమ్యంగా కుటీరాన… రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన… దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన… రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన… దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో
ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి
ఒక ఆమని దయ చేసింది
నిదురించే తోటలోకి
పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి
కమ్మటి కల ఇచ్చింది
విఫలమైన నా కోర్కెలు… వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి… అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు… వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి… అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా… గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న… నావను ఆపండి
రేవు బావురుమంటోందనీ
నావకి చెప్పండీ… నావకి చెప్పండి
Nidurinche Thotaloki song is from the & English - Muthyala Muggu movie.
Nidurinche Thotaloki song was sung by P Susheela.
Nidurinche Thotaloki song lyrics were written by Gunturu Seshendra Sharma.
Nidurinche Thotaloki song music was composed by KV Mahadevan.