
| Movie Name | Damarukam |
|---|---|
| Director | Srinivasa Reddy |
| Star Cast | Akkineni Nagarjuna, Anushka Shetty, Prakash Raj |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Sri Krishna & Harini |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Aditya Music |
నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
నేననే పేరులో నువ్వు… నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓహో, ప్రేమకే రూపమే ఇచ్చి… దానికే ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా, ఆ ఆ ఆఆ
ఓ, నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
నువ్వంటే ఎంతిష్టం… సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం… చూసావా ఈ చిత్రం
కనుపాపలోన నీవే కల… ఎద ఏటిలోన నువ్వే అల
క్షణ కాలమైనా చాల్లె ఇలా… అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి, ఓ ఓ
ఓ, నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
అలుపొస్తే తలనిమిరే… చెలిమవుతా నీకోసం
నిదరొస్తే తలవాల్చే… ఒడినవుతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా… పైటంచు మీద నువ్వే కదా
నడుమొంపులోన నువ్వే కదా… ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే, ఓ ఓ
ఓ, నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
Nesthama Nesthama song is from the Damarukam movie.
Nesthama Nesthama song was sung by Sri Krishna & Harini.
Nesthama Nesthama song lyrics were written by Bhaskara Bhatla.
Nesthama Nesthama song music was composed by Devi Sri Prasad.