
| Movie Name | |
|---|---|
| Director | K Bapaiah |
| Star Cast | Krishna, Sarada |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
ఆ ఆ ఆ హా ఆహ ఆఆ ఆ ఆ ఆహ ఆఆ
నేనొక ప్రేమ పిపాసిని… నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది… నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని… నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది… నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
తలుపు మూసిన తలవాకిటనే
పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచి బదులే రాక
అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటనే
పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులే రాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది… నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులొత్తగా… ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని
పగటికి రేయి, రేయికి పగలు… పలికే వీడ్కోలు
సెగరేగిన గుండెకు చెబుతున్నా… నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో… నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా… నివురై పోతాను
నేనొక ప్రేమ పిపాసిని… నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది… నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
Nenoka Prema Pipasini song is from the movie.
Nenoka Prema Pipasini song was sung by S P Balasubramanyam.
Nenoka Prema Pipasini song lyrics were written by Acharya Athreya.
Nenoka Prema Pipasini song music was composed by KV Mahadevan.