
| Movie Name | Mr King ( ) |
|---|---|
| Director | Sasiidhar Chavali |
| Star Cast | Sharan Kumar, Yashvika Nishkala, Urvi Singh |
| Music | Mani Sharma |
| Singer(s) | Harika Narayan |
| Lyricist | Kadali |
| Music Label |
నేనెరగని దారేదో నన్నే చేరి
నా నడకను మార్చేసిందా
నే తలవని మాయేదో నీలా సోకి
నా బతుకును అల్లేసిందా
నువ్ పిలిచిన పేరే… నాదని అననా
నువ్ నడిచిన దారే నడకవనా
నువ్ కలసిన రోజే… జన్మని అననా
నువ్ కలవని ఈనాడే చితినవనా
నీ అల్లరిలోన నే నవ్వుని కానా
నీ కోపంలోన మూగైపోనా
నువ్ పిలిచిన పూటే
ఓ పువ్వుల బాటై
నీ సిగ్గును దాటి నీతో రానా
నా పగటి కోసం… నువు ఓ వెలుగవా
రాతిరిన నా టెన్ టు ఫైవ్ వెన్నెలవా
నా కనులు కోరే… కలవై నిలవవా
నీ తోడు నాకే అనవా
నే ఇదివరకేనాడు పడని ఆశ
నాకెదురుగా నీలో చూసా
ఓ తడవున తేలేది కాదీఆట
నీ గెలుపుగ నన్నే చేశా
నీ కనులలో కాలే కాగడనవనా
నీ నిదురలో చేరే కలనవనా
నీ అలసటే తీర్చే తీరికనవనా
నే అలుపనే మాటే అనగలనా
నువ్ తలవని వింత… నా నరనరమంతా
నీ తలపును ముంచే బందీ కానా
నీ చనువల చెంత… నా అణువణువంతా
ఏ అదుపులు లేని తేనె వాన
ఊపిరిని పంచే పనిలో మునగనా
నా కధకి టెన్ టు ఫైవ్ కంచే కననా
నీ చెలిమి కావాలని నేనడగనా
నీ జతిని నేనే అవనా
నా మనసున… ఇన్నాళ్లు లేదీ ధ్యాస
నా సగమును నీకిచ్చేసా
నా వయసుకి… నిన్నల్లో లేదీ వరస
నా నిజముగ నిన్నే చూశా
నా పగటినంతా… నీ పేరున మరిచా
నా నిదుర నాదే కాదని విడిచా
నీ తనువు నిండే… ఆ ఊపిరినవుతా
నా మదిని పంచి… నీ వశమవుతా
ఏ పరుగున నేనే నీ నుదుటున జారే
ఆ చెమటను తాకే గాలై పోనా
ఏ అలకలు పోకా… నే తగువుకు రాక
నీ హృదయమునేలే రాణి కానా
నా నిమిషమాపే చనువై దొరకవా
నా కనులు కోరే కలవా
ఏ క్షణమునైనా వదిలే కదలవా
ఊహలకు లేదే కొదవా
Neneragani Daaredho song is from the Mr King ( ) movie.
Neneragani Daaredho song was sung by Harika Narayan.
Neneragani Daaredho song lyrics were written by Kadali.
Neneragani Daaredho song music was composed by Mani Sharma.