
| Movie Name | Surya IPS |
|---|---|
| Director | A.Kodanda Rami Reddy |
| Star Cast | Venkatesh, Vijayashanthi |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఓ ఓఓ ఓఓ ఓ… ఓ ఓఓ ఓఓ ఓ
ఓఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓ ఓ ఓ
నెలరాజా, ఆ ఆఆ… ఇటు చూడరా
నెలరాజా ఇటు చూడరా
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
తగువేళరా తగవేలరా రవితేజా
నవరోజా తెర తీయవా
నవరోజా తెర తీయవా
నీ కోసం ఆశగా… నిరీక్షించె ప్రాణం
నీ చేతుల వాలగా… చిగిర్చింది ప్రాయం
నీవైపే దీక్షగా… చలించింది పాదం
నీ రూపే దీపమై… ప్రయాణించె జీవం
నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా
నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా
రతిరాజువై జత చేరవా… విరివానవై నను తాకవా
నవరోజా తెర తీయవా… నవరోజా తెర తీయవా
దివితారక తవితీరగా నినుచూచా
జవనాలతో జరిపించవే జతపూజా
నెలరాజా, ఆ ఆ… ఇటు చూడరా
నెలరాజా, ఆ ఆ… ఇటు చూడరా
ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని
ఈ స్నేహం జంటగా జగాలేలుకోని
నీ కన్నులపాపగా కలలు ఆడుకోని
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని
ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించనీ
దిగంతాల తారల కోట ప్రవేశించనీ
గతజన్మనే బ్రతికించనీ
ప్రణయాలలో శృతి పెంచనీ
నెలరాజా, ఆ ఆఆ… ఇటు చూడరా
నవరోజా, ఆ ఆ ఆ… తెర తీయవా
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
జవనాలతో జరిపించవే జతపూజా
నెలరాజా, ఆ ఆఆ… ఇటు చూడరా
నవరోజా, ఆ ఆ ఆ… తెర తీయవా
Nelaraja Itu Chudara song is from the Surya IPS movie.
Nelaraja Itu Chudara song was sung by S P Balasubramanyam, Chitra.
Nelaraja Itu Chudara song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nelaraja Itu Chudara song music was composed by Ilayaraja.