
| Movie Name | Na Jeevitham |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Yarlagadda Daniel Raj |
| Singer(s) | Sharon Philip Gariki |
| Lyricist | Rev. G. Vijay Kumar |
| Music Label | Philip Sharon OFFICIAL |
నీవు లేకుండా… నేనుండలేను
నాకున్నవన్నీ… నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా…
నా ఊపిరి నీవే యేసయ్య…
జాలి లేనిది… ఈ మాయ లోకము
కలత చెందెను… నా దీన హృదయము
నను కాపాడుటకు… నా దరి నిలచితివా
హస్తము చాపితివా… నను బలపరచితివా
నను ప్రేమించేవారు… ఎందరు ఉన్నను
అంతము వరుకు… నాతో ఉండరు
నాలో ఉన్నవాడా… నాతో ఉన్నవాడా
నా ప్రాణము… నీవే యేసయ్య
కన్నులు మూసిన… కన్నులు తెరచిన
నా చూపులలో… నీ రూపమే
కనికరించితివా… కరుణామయుడా
కృప చూపించితివా… నాకు చాలిన దేవుడా
Also Read: Anandam Neelone Lyrics
Neevu Lekunda Nenundalenu song is from the Na Jeevitham movie.
Neevu Lekunda Nenundalenu song was sung by Sharon Philip Gariki.
Neevu Lekunda Nenundalenu song lyrics were written by Rev. G. Vijay Kumar.
Neevu Lekunda Nenundalenu song music was composed by Yarlagadda Daniel Raj.