
| Movie Name | Hosanna Ministries Manoharuda |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Pastor Jhon Wesley |
| Lyricist | |
| Music Label |
నీవే కృపాదారము త్రియేక దేవా
నీవే క్షేమాదారము నా యేసయ్యా
నీవే కృపాదారము… త్రియేక దేవా
నీవే క్షేమాదారము… నా యేసయ్యా
నూతన బలమును… నవనూతన కృపను
నూతన బలమును… నవనూతన కృపను
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాదారము… త్రియేక దేవా
నీవే క్షేమాదారము… నా యేసయ్యా
ఆనందించితిని అనురాగబంధాల… ఆశ్రయపురమైన నీలో నేను
ఆనందించితిని అనురాగబంధాల… ఆశ్రయపురమైన నీలో నేను
ఆకర్షించితిని ఆకాశముకంటే… ఉన్నతమైన నీ ప్రేమను చూపి
ఆకర్షించితిని ఆకాశముకంటే… ఉన్నతమైన నీ ప్రేమను చూపి
ఆపదలెన్నో అలుముకున్నను… అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో… అండగా నిలచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి… కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా… ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
నీవే కృపాదారము… త్రియేక దేవా
నీవే క్షేమాదారము… నా యేసయ్యా
సర్వకృపానిధి సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి || 2 ||
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనముకలిగి || 2 ||
శిధిలముకానీ సంపదలెన్నో… నాకై దాచితివీ
సాహసమైన గొప్ప కార్యములు… నాకై చేసితివీ
సర్వశక్తిగల దేవుడవై… నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా… ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాదారము… త్రియేక దేవా
నీవే క్షేమాదారము… నా యేసయ్యా
ప్రాకారములను దాటించితివి… ప్రార్థన వినెడి పావనమూర్తివి || 2 ||
పరిశుద్దులతో నన్ను నిలిపితివి… నీ కార్యములను నూతన పరచి || 2 ||
పావనమైన జీవనయాత్రలో… విజయము నిచ్చితివి
పరమ రాజ్యమును… నిలుపుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా… ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాదారము… త్రియేక దేవా
నీవే క్షేమాదారము… నా యేసయ్యా
నూతన బలమును… నవనూతన కృపను
నూతన బలమును… నవనూతన కృపను
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
Neeve Krupadharamu song is from the Hosanna Ministries Manoharuda movie.
Neeve Krupadharamu song was sung by Pastor Jhon Wesley.