Movie Name | Tribanadhari Barbarik (2025) |
---|---|
Director | Mohan Srivatsa |
Star Cast | Satya Raj |
Music | Infusion Band |
Singer(s) | Sid Sriram |
Lyricist | Raghuram |
Music Label | Aditya Music |
సాంగ్: నీవల్లే (Neevalle)
సినిమా పేరు: త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik)
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
లిరిక్స్ : రఘురాం (Raghuram)
సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్ (Infusion Band)
నటీనటులు : వశిష్ట (Vasishta), సాంచి రాయ్ (Sanchi Rai)
కోరస్ : వల్లి గాయత్రి (Valli Gayathri), లక్ష్మీ మేఘన (Laxmi Meghana), నాద ప్రియ (Nada Priya), బృందా (Brindha)
రచన & దర్శకత్వం: మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa)
ఏం అవుతున్నదో నా గుండెలో
ఉండుండి ఈరోజిలా..
ఏం దాచుంచావో ఆ కళ్ళలో
నిలువెల్ల మునిగానిలా..
ఈ సంగతే నచ్చింది చాలా
నీ సందడే నా లోపల..
ఈ హాయినే మోయాలి అంటే
ఎలా ఎలా..
నీవల్లే నీవల్లే ఈ మాయే నీవల్లే
కల్లోను కల్లోలలే నీవల్లే
నీవల్లే నీవల్లే ఆనందం నన్నల్లె
మొత్తంగా మరిచాను నా నిన్నలే
నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే
నాపైనే కురిశాయిలే నీవల్లే
నీవల్లే నీవల్లే వేవేల వర్ణాలే
నా చుట్టూ వాలాయిలే నీవల్లే
నిన్న మొన్న నా తీరులో
లేనే లేదే ఈ ఆరాటం
నీతో పాటే అడుగేస్తుంటే
మారిందే నా వాలకం
సరదా సరదాగా సాగే ఈ పయనం
సరిపొవట్లేదే నీతోటి సమయం
జతగా నువ్వుంటే అంతే అదృష్టం
అతిగా పొగిడేస్తే కాదే నా నేరం
ఈ సంగతే నచ్చింది చాలా
నీ సందడే నా లోపల..
ఈ హాయినే మోయాలి అంటే
ఎలా ఎలా.. ఆ..
నీవల్లే నీవల్లే ఈ మాయే నీవల్లే
కల్లోను కల్లోలలే నీవల్లే
నీవల్లే నీవల్లే ఆనందం నన్నల్లె
మొత్తంగా మరిచాను నా నిన్నలే
నీవల్లే నీవల్లే వెన్నెల్లో వర్షాలే
నాపైనే కురిశాయిలే నీవల్లే
నీవల్లే నీవల్లే వేవేల వర్ణాలే
నా చుట్టూ వాలాయిలే నీవల్లే