
| Movie Name | Darja (2022) |
|---|---|
| Director | Saleem Malik |
| Star Cast | Anasuya Bharadwaj, Sunil Varma |
| Music | Raprock Shakeel |
| Singer(s) | Karthik |
| Lyricist | Vishnu Yerravula |
| Music Label |
నీలి నీలి మేఘమా
నువ్వే నాలో నాలో ప్రాణమా
చుక్కల నడమనున్న
ఓ చందమామ రూపమా
నిన్ను కోరింది నా ప్రాణమే
నే చేస్తున్న నీ ధ్యానమే
నీ ఊహల రెక్కల్తో
విహరిస్తు ఉన్నానిలా
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ ఓరచూపు వలపు నవ్వుతో
బంధించావే ప్రేమ
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ ఓరచూపు వలపు నవ్వుతో
బంధించావే ప్రేమ
నిన్ను చూసే కళ్లలోనా
బాపుబొమ్మ నువ్వేనా
కలలోనా కౌగిట్లోనా
నిన్ను నేను దాచుకోనా
గోదారి తెప్పల్లే తుల్లిందే మనసు
నవ్వేసి పోమాకే మందారమా
నా చుట్టు కమ్మేసి దాగుందే ప్రేమ
నీదేలే ఈ జన్మా
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ ఓరచూపు వలపు నవ్వుతో
బంధించావే ప్రేమ
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ ఓరచూపు వలపు నవ్వుతో
బంధించావే ప్రేమ
నీ అడుగులో మడుగుల్లోనా
అడుగేసి వస్తు ఉన్నా
కడదాకా గుండెల్లోనా
నీతోనే ఉండిపోనా
పచ్చ పైరల్లె ఊగిందే
నీ కొంటె వయసు
నీతోనే నేనుంటే ఆనందమా
కవ్వించి కడలల్లే ముంచిందే ప్రేమ
నీవే ఓ వరమా
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ ఓరచూపు వలపు నవ్వుతో
బంధించావే ప్రేమ
ఏం చేసావే నా ప్రాణమా
నా చిన్ని గుండెల్లోన సరిగమ
నీ ఓరచూపు వలపు నవ్వుతో
బంధించావే ప్రేమ
Neeli Neeli Meghama song is from the Darja movie.
Neeli Neeli Meghama song was sung by Karthik.
Neeli Neeli Meghama song lyrics were written by Vishnu Yerravula.
Neeli Neeli Meghama song music was composed by Raprock Shakeel.